Begin typing your search above and press return to search.
త్రిష రికార్డు అందుకోవడం అసాధ్యం
By: Tupaki Desk | 16 Nov 2016 10:46 AM ISTచెన్నై బ్యూటీ త్రిష కెరీర్ చివరి దశకు వచ్చేసింది.. ఇక అమ్మడు సర్దేసుకోవడమే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కాలం వెళ్లబుచ్చడమే లాంటి మాటలు.. ఓ ఏడాది క్రితం బాగానే వినిపించాయి. త్రిష బౌన్స్ బ్యాక్ అయిన తీరు అందరికీ షాక్ కొట్టించేసింది. రీసెంట్ గా ధర్మయోగిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ రోల్ చేసి ఆడియన్స్ ను మెప్పించేయగా.. త్రిష చేతిలో ప్రస్తుతం అర డజన్ సినిమాలున్నాయి.
వీటితో పాటు ఇప్పుడే క్రేజీ ప్రాజెక్టులో కూడా త్రిషకు స్థానం వచ్చేసినట్లే అంటున్నారు. ప్రస్తుతం రోబో2 షూటింగ్ లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్.. తన నెక్ట్స్ మూవీగా కబాలి2 చేయనున్నారనే విషయం ఇప్పటికే ఖాయమైంది. కబాలి2 టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించేయడంతో.. సీక్వెల్ తెరకెక్కించడం కన్ఫాం అనే చెప్పాలి. ధనుష్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ మూవీలో హీరోయిన్ గా మొదట అమలాపాల్ ను అనుకున్నా.. ఇప్పుడు త్రిషకు ఆ ఆఫర్ దక్కిందట.
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సహా సీనియర్ హీరోల్లో అందరినీ.. కోలీవుడ్ లో కమల్ హాసన్ తో సహా మొత్తం అందరు హీరోలను కవర్ చేసిన త్రిష.. రజినీ ఒక్కరితోనే యాక్ట్ చేయలేదు. కబాలి2తో ఆ లోటు కూడా తీరిపోతుండడంతో.. ఈ జనరేషన్ లో అందరు స్టార్ హీరోలు.. కుర్రహీరోలతో నటించిన రికార్డ్ చెన్నై బ్యూటీ సొంతం అయిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/