Begin typing your search above and press return to search.

త్రిష క్యాడ్బరీ లవ్ చూశారా..

By:  Tupaki Desk   |   9 Jun 2017 6:27 AM GMT
త్రిష క్యాడ్బరీ లవ్ చూశారా..
X
వయసు పెరిగినా సొగసు తరగని హీరోయిన్లలో చెన్నైసుందరి త్రిష పేరు కచ్చితంగా ఉంటోంది. దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగింది. ప్రస్తుతం టాప్ పొజిషన్ లో లేకపోయినా హీరోయిన్ గా అవకాశాలు వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి. ఈ సుందరికి జంతు ప్రేమ కాస్తంత ఎక్కువే. అందులో కుక్కలంటే త్రిషకు అమితమైన ఇష్టం. సెలబ్రిటీల స్థాయిలో ఉన్నవారు సాధారణంగా కుక్కలను పెంచుకుంటే మంచి జాతి శునకాలనో.. విదేశాల నుంచో అరుదైన జాతులనో తెచ్చి పెంచుకుంటారు. కానీ త్రిష మాత్రం ఈ విషయంలో చాలా డిఫరెంట్. ఈమెకు వీధి కుక్కలంటేనే ఎంతో ఇష్టం.

తాజాగా త్రిష ఓ చిన్ని కుక్కను చేరదీసింది. దానికి క్యాడ్బరీ జూనియర్ అని పేరు కూడా పెట్టింది. దానిని ఒళ్లో పెట్టుకుని ఆటలాడుకోవడమే కాదు.. దానికి ఎక్సర్ సైజ్ కూడా నేర్పిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిని చూస్తే చాలు వీధి కుక్కలంటే త్రిషకు ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుక్కలను పెంచుకోవడమంటే ఏదో పెంచామన్నట్టు కాకుండా వాటితో టైం స్పెండ్ చేస్తూ వాటికి ప్రేమ పంచుతున్న త్రిషను అభినందించక తప్పదు.

అన్నట్టు త్రిష పెటాలో చిన్నప్పటి నుంచే యాక్టివ్ మెంబర్. ఎక్కడ వీధి కుక్కలు కనిపించినా వాటిని తెచ్చి పెంచుకోవడమో... కుదరకపోతే శునకాల సంరక్షణ కేంద్రాలకు తరలించడమో చేస్తుంటుంది. తెలుగులో ఆమె సినిమాలేవీ ప్రస్తుతం రిలీజ్ కు రెడిగా లేవు కానీ తమిళంలో రాబోయే ఆరు నెలల్లో ఐదు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలు బంపర్ హిట్లయితే తెలుగులో బౌన్స్ బ్యాక్ అవడం పెద్దగా విషయం కాకపోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/