Begin typing your search above and press return to search.

టాయిలెట్ కట్టిన స్టార్ హీరొయిన్

By:  Tupaki Desk   |   29 Dec 2017 1:28 PM GMT
టాయిలెట్ కట్టిన స్టార్ హీరొయిన్
X
అమ్మాయిల చేతులు ఎంత సున్నితంగా ఉంటాయో తెలుసుగా. అందులోనూ మన హీరొయిన్లవి అయితే మరీనూ. తాకితే ఎక్కడ కందిపోతాయో అన్నంత సుకుమారంగా మైంటైన్ చేస్తూ ఉంటారు. కాని త్రిష మాత్రం తాను ఆ టైపు కాదని ప్రూవ్ చేస్తోంది. యునిసెఫ్ తరఫున అంబాసడర్ గా ఉన్న త్రిషా ఆ సంస్థ చేపడుతున్న ప్రజా హిత కార్యక్రమాలకు తన వంతు చేయూత అందిస్తోంది. పైన పిక్ చూసారుగా. స్వచ్చ భారత్ ప్రాముఖ్యత వివరించేలా తనే స్వయంగా ఇటుకలు పేరుస్తూ మరుగుదొడ్డి నిర్మాణానికి తన వంతు చేయూత అందిస్తోంది. ఇది నిజంగా స్ఫూర్తి ఇచ్చే విషయమే. ఇప్పటికీ లక్షల గ్రామాల్లో కనీస అవసరం అయిన మరుగుదొడ్డి లేక అక్కడి మహిళలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళడం 2017 జమానాలో కూడా కొనసాగుతోంది. అందుకే అక్షయ్ కుమార్ ఏకంగా టాయిలెట్ పేరుతో ఒక సినిమా తీస్తే ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది.

త్రిష లాంటి హీరొయిన్లు ఇలా ముందుకు రావడం వల్ల అభిమానులే కాక సాధారణ పౌరులు కూడా ప్రభావితం చెందే అవకాశం ఉంది. స్వచ్చంగా ఉండటం అంటే మనుషులతో పాటు పరిసరాలను కూడా ఉంచుకోవడం అనే పాయింట్ ని ఇలా పాపులర్ హీరొయిన్లు చెబితే మెసేజ్ త్వరగా రీచ్ అవుతుంది అనడంలో డౌట్ అక్కర్లేదు. మరి త్రిషని ఇన్ స్పిరేషన్ గా తేసుకుని ఇంకెవరు ముందుకు వస్తారో చూడాలి. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. కెరీర్ ఎండింగ్ లో మాత్రమే హీరోలకు కాని హీరొయిన్ల కు కాని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నాకే సంఘం గురించి అలోచించగలం. అందులో తప్పేమీ లేదు లేండి.