Begin typing your search above and press return to search.

అమ్మ లేకపోతే నేను లేను: త్రిష

By:  Tupaki Desk   |   2 Aug 2015 3:40 PM IST
అమ్మ లేకపోతే నేను లేను: త్రిష
X
వైఫల్యాల్ని చూసి భయపడి పారిపోనివాళ్లే స్థితప్రజ్ఞులు. ఆ రకంగా చూస్తే అందాల త్రిష స్థితప్రజ్ఞతను మెచ్చుకోవాల్సిందే. ఈ అమ్మడు కెరీర్‌ పరంగా పెద్ద విజయం దక్కించుకున్నా... వ్యక్తిగత జీవితంలో వైఫల్యాల్ని ఎదుర్కొంటోంది. ప్రేమ, పెళ్లి విషయంలో ఇప్పటికే పెద్ద దెబ్బ తింది. అయినా తనలోని పట్టుదలను సడలనీయకుండా ఇంకా ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతోంది. దటీజ్‌ త్రిష. అంతేకాదండోయ్‌ త్రిషకు ఓ ముద్దుపేరుంది. హనీ అని పిలుస్తారట. హనీ ఏం చెప్పిందంటే...

=మీ ముద్దు పేరు హనీ అట! నిజమా?
అవును దగ్గరగా తెలిసినవాళ్లు అలానే పిలుస్తారు.

=ఎన్ని భాషలు మాట్లాడుతారు?
తెలుగు, తమిళ్‌, ఇంగ్లీష్‌, హిందీ, ఫ్రెంచ్‌

=నచ్చే రంగు?
నలుపు

=నచ్చే ఆహారం?
బ్రౌన్‌ సుగర్‌, చికెన్‌ కర్రీ

=నచ్చిన సినిమాలు?
ఇంగ్లీష్‌ పేషెంట్‌, ది సైలెన్స్‌ ఆఫ్‌ ది ల్యాంబ్స్‌

=నచ్చే నటీనటులు?
జులియా రాబర్డ్స్‌ ల, టామ్‌ హ్యాంక్స్‌

=రోల్‌ మోడల్‌?
మా అమ్మ. తను లేకపోతే నేను లేను.

=నటి కాకపోయి ఉంటే?
సైకాలజిస్టుని అయ్యుండేదాన్ని.

ఫ్యాన్స్‌కి చెప్పేది?
నోరు లేని జీవాల్ని ప్రేమించండి.

=మిమ్మల్ని బాధపెట్టేది?
నోరులేని జీవాలు రోడ్డు పక్క కుయ్యో మొర్రో అంటూ జీవించడం. మనకి అన్నీ ఇచ్చినా వాటికి ఎవరూ ఏదీ ఇవ్వలేదనిపిస్తుంది.

=ఇతరుల్లో నచ్చనిది?
శుభ్రత పాటించకపోవడం, గట్టిగా మాట్లాడడం..