Begin typing your search above and press return to search.

చెర్రీ విలన్ తో చిరు హీరోయిన్ ఫిక్స్??

By:  Tupaki Desk   |   23 Sep 2016 9:30 AM GMT
చెర్రీ విలన్ తో చిరు హీరోయిన్ ఫిక్స్??
X
అమ్మాయిల కలల రాకుమారుడు అనిపించుకున్న అరవింద్ స్వామి.. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమమయ్యాడు. మళ్లీ గతేడాది కడలి చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడంతో చాలామంది తెగ ఆనందించేశారు. గతేడాది తనీ ఒరువన్ లో విలన్ గా మెప్పించాడు. ఇప్పుడు ఇదే సినిమా తెలుగు రీమేక్ ధృవలో చెర్రీకి కూడా విలన్ గా చేస్తున్న అరవింద్ స్వామితో.. స్టాలిన్ లో చిరుకు హీరోయిన్ గా నటించిన త్రిష జోడీ కడుతోంది.

రెండేళ్ల క్రితం బ్లాక్ మనీపై తమిళంలో వచ్చిన మూవీ చతురంగ వేట్టై మంచి సక్సెస్ ను సాదించింది. దీనిలో నటరాజ్.. ఇషానా నాయర్ లు నటించగా.. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు దర్శకుడు వినోద్ సిద్ధమవుతున్నాడు. గతంలో లోబడ్జెట్ మూవీగా వచ్చిన భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రాన్ని.. ఈ సారి భారీ బడ్జెట్ తో తీయాలన్నది దర్శకుడి ఆలోచన. అందుకే లీడ్ రోల్ లో చేసేందుకు అరవింద్ స్వామిని ఒప్పించగా.. హీరోయిన్ గా త్రిషను సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీ మోహిని మినహాయిస్తే.. చేతిలో వేరే సినిమాలేని త్రిషకు.. ఇది భారీ ఆఫర్ అనే చెప్పాలి. అరవింద్ స్వామితో జోడీ కట్టడం విషయంలో త్రిష నుంచి అభ్యంతరాలు రాకపోవచ్చని అంటున్నారు కోలీవుడ్ జనాలు.