Begin typing your search above and press return to search.

అబ్బే, త్రిషతో క్యాట్‌ ఫైట్‌ లేదబ్బా

By:  Tupaki Desk   |   30 July 2015 7:30 AM GMT
అబ్బే, త్రిషతో క్యాట్‌ ఫైట్‌ లేదబ్బా
X
క్యూట్‌ త్రిష, హాట్‌ అంజలి ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? .. ఆ సమయం సందర్భం రానే వచ్చింది. జయం రవి హీరోగా సకలకళావల్లవన్‌ చిత్రంలో ఈ ఇద్దరూ కలిసే నటించారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే సినిమా రిలీజ్‌ కి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌ లో హడావుడి చేస్తున్నారు ఈ భామలు.

జయం రవి సహా ప్రచార కార్యక్రమాల్లో బోలెడంత హడావుడి చేసేస్తున్నారు. అయితే షూటింగ్‌ సమయంలో ఈ భామల మధ్య క్యాట్‌ ఫైట్‌ నడిచిందన్న ఓ రూమర్‌ కోలీవుడ్‌ లో వినిపించింది. ఇదే విషయంపై అంజలిని ప్రశ్నిస్తే.. కాస్త తడబడుతూనే.. అలాంటిదేం లేదు. మేం ఇద్దరం స్నేహంగా కలిసిపోయి నటించాం అని చెప్పింది. అంతేనా.. మీ క్యారెక్టర్‌ కంటే త్రిష క్యారెక్టర్‌ కే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందిట కదా! అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదని కొట్టిపారేసింది.

మా ఇద్దరి పాత్రలు ఇంచుమించు సమానంగానే ఉంటాయి. ఎవరూ ఎక్కువ కాదు. ఒక సింపుల్‌ కథాంశాన్ని దర్శకుడు వినిపించినప్పుడు చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశానని అంజలి చెప్పింది. విలేజీ అమ్మాయిగా కనిపించడానికి కాస్త బరువు తగ్గమని దర్శకుడు సూచించాడు. ఆరు కిలోలు తగ్గానని అంజలి చెప్పింది. ఈ సినిమాతో పాటు విజయ్‌ సేతుపతి సరసన అంజలి ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.