Begin typing your search above and press return to search.

త్రిష తో చాలా పెద్ద సాహ‌సాలే చేయించారు?

By:  Tupaki Desk   |   17 Dec 2022 4:52 AM GMT
త్రిష తో చాలా పెద్ద సాహ‌సాలే చేయించారు?
X
అందాల త్రిష కెరీర్ చ‌ర‌మాంకానికి చేరుకుంది. రిటైర్మెంట్ కి ద‌గ్గ‌ర్లోనే ఉంది. దీంతో సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోల‌తో త‌ప్ప‌! ఇంకే హీరోతో ప‌నిచేయ‌డం లేదు. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కూడా బ‌డా నిర్మాణ సంస్థ‌లైతే క‌మిట్ అవుతుంది. లేదంటే? కామ్ గా ఉంటుంది. అయితే హీరోయిన్ గా స‌క్సెస్ అయినంత‌గా ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌పై మాత్రం త‌న ముద్ర వేయ‌లేక‌పోయింది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం అమ్మ‌డిలో స‌హ‌జంగా క‌నిపించే న‌ట‌నేని మీడియాలో పలుమార్లు క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. అంద‌మైతే ఉందిగానీ....యాక్టింగ్ స్కిల్స్ మెరుగు ప‌ర‌చుకోవ‌డంలో ఇప్ప‌టికీ వీక్ అనే విమ‌ర్శ‌లున్నాయి. అలాంటి లేడీ స్టార్ తో ఏకంగా భారీ యాక్ష‌న్ చిత్ర‌మే చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మిళ ద‌ర్శ‌కుడు శ‌ర‌వ‌ణ‌న్ త్రిష‌తో 'రాంగీ' అనే ఓ సినిమా చేసాడు.

ఏడాది నుంచి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. థియేట‌ర్లో రిలీజ్ చేయాలా? ఓటీటీ లోరిలీజ్ చేయాలా? అన్న‌ సందిగ్ధంలో కొంత స‌మ‌యం వృద్ధా అయింది. అయితే తుదిగా థియేట‌ర్ రిలీజ్ కే ఫిక్స్ అయ్యారు. దీంతో ఈనెల 30న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా...స్టార్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ క‌థ అందించారు.

అయితే 'రాంగీ' భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ అవ్వ‌డం..అందులో త్రిష న‌టించ‌డంతో సినిమా ఎలా ఉంటుంది? అన్న ఆస‌క్తి అప్పుడే మొద‌లైంది. త్రిష న‌ట‌న‌పై ఇప్ప‌టికే కొన్ని ర‌కాల విమ‌ర్శ‌లున్నాయి. బ్యూటీతో రాణించింది త‌ప్ప న‌ట‌న‌తో కాద‌న్న‌ది చాలా మంది అభిప్రాయం. ఏ సినిమా అయినా ఒకే ర‌క‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ ఉంటాయ‌ని చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది.

ఆమె లేడీ ఓరియేంటెడ్ నాయిక‌గా విఫ‌ల‌మ‌వ్వ‌డానికి కార‌ణం కూడా ఇదేన‌ని కోలీవుడ్ మీడియాలో సైతం క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. అలాంటి త్రిష‌తో శ‌ర‌వ‌ణ‌న్ యాక్ష‌న్ చిత్రం చేయ‌డం అంటే దీన్ని పెద్ద సాహ‌సంగానే భావించాల‌ని నెటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు. మరి రాంగీలో యాక్టింగ్ ప‌రంగా కొత్త‌గా ట్రై చేసిందా? అన్న‌ది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.