Begin typing your search above and press return to search.

చిన్న సినిమాలు - పెద్ద ఎఫెక్టు

By:  Tupaki Desk   |   12 Aug 2015 3:58 AM GMT
చిన్న సినిమాలు - పెద్ద ఎఫెక్టు
X
శాటిలైట్‌ ని, బిజినెస్‌ని కంటెంట్‌ తో కొట్టొచ్చని నిరూపిస్తున్నాయి మూడు చిన్న సినిమాలు. విషయం శూన్యం అయిన సినిమాల్ని మాత్రమే టీవీ చానెళ్లు కొనుక్కోవడం లేదనడానికి ఇవిగో ఈ సినిమాలే ప్రూఫ్‌. త్వరలో రిలీజ్‌ కి వస్తున్న సినిమాల్లో త్రిపుర, భలే మంచి రోజు, సినిమా చూపిస్త మావ ఈ మూడు సినిమాలకు బిజినెస్‌ విషయంలో మైండ్‌ బ్లోయింగ్‌ క్రేజు వచ్చేసింది.

సినిమా చూపిస్త మావ చిత్రానికి రిలీజ్‌ కి ముందే క్రేజొచ్చింది. ఈ సినిమా నైజాం రిలీజ్‌ హక్కుల్ని అగ్రనిర్మాత దిల్‌ రాజు చేజిక్కించుకున్నారు. దిల్‌రాజు సినిమా ప్రివ్యూ చూసి విషయం ఉందని తెలుసుకుని హాట్‌ కేక్‌ లా కొనేశాడు.

అలాగే సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'భలే మంచి రోజు' ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంది. ఇప్పటికే బిజినెస్‌ పరమైన స్పీడ్‌ పెరిగిందని చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే చిన్న సినిమాకి రోజులు మారినట్టే కనిపిస్తోంది. ఇవన్నీ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొడితే ఈ హుషారు మరింత పెరుగుతుంది. పెద్ద చేపలు పెద్దవే, చిన్న చేపలు చిన్నవే అన్నట్లు ఎవరి బిజినెస్‌ వారికి ఉంటుంది. అది సంగతి.