Begin typing your search above and press return to search.

ఈ హాట్ బ్యూటీ సినిమా చూడాలట

By:  Tupaki Desk   |   15 Feb 2018 2:17 PM GMT
ఈ హాట్ బ్యూటీ సినిమా చూడాలట
X
స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే హాట్ గా కనిపించడంతో పాటు కొంచెం ఇండస్ట్రీలో అందరిని కలుస్తూ ఉండాలి. అంతే కాకుండా ఎవరు ఎలాంటి సినిమాలను చేస్తున్నారు. ఒక సినిమా చేస్తే జనాలకు ఎలా చేరవేయాలి అనే ఆలోచన కూడా ఉండాలి. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం ప్రమోషన్స్ కి రాకుండా వెకేషన్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా నా సినిమా చుడండి అంటోంది. ఆమె ఎవరో కాదు త్రిదా చౌదరి.

ఈ హాట్ బికినీ బ్యూటీ మనసుకు నచ్చింది అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని తెరకెక్కించిన ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. టీజర్లలో ట్రైలర్లలో అమ్మడు గ్లామర్ టచ్ ని గట్టిగానే ఇచ్చింది. సినిమాలో కూడా ఇంకా హాట్ సీన్స్ చాలా ఉన్నాయట. అయితే ప్రస్తుతం దర్శకురాలు మంజుల హీరో సందీప్ కిషన్ ప్రమోషన్స్ లలో తీరిక లేకుండా పాల్గొంటున్నారు.

కానీ హీరోయిన్ త్రిదా మాత్రం ప్రమోషన్స్ కి రాకుండా.. వెకేషన్స్ కి చెక్కేసి నా సినిమా చుడండి అని సోషల్ మీడియాలో పోటోలను పోస్ట్ చేస్తూ చెప్పేస్తోంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ బ్యూటీనే ఆలోచించుకోవాలి. సినిమా సక్సెస్ లో అందరు భాగం అవుతారు. ఫెయిల్ అయినా కూడా అందరు బాధ్యతగా తీసుకోవాలి. అలాగే ప్రమోషన్స్ కూడా చేయాలి. మరి ఈ విషయాన్ని నటీమణులు ఎప్పుడు అర్ధం చేసుకుంటారో..