Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: క్యూట్ బ్యూటీ వేడెక్కించే భంగిమ‌

By:  Tupaki Desk   |   7 Sep 2021 12:30 AM GMT
ఫోటో స్టోరి: క్యూట్ బ్యూటీ వేడెక్కించే భంగిమ‌
X
క్యూట్ బ్యూటీ త్రిథా చౌద‌రి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో వ‌రుస‌గా న‌వ‌త‌రం హీరోల స‌ర‌స‌న ఈ బ్యూటీ న‌టించింది. భారీ క్రేజు ఉన్న చిత్రాల్లో న‌టించ‌క‌పోయినా త‌న రేంజుకు త‌గ్గ‌ట్టు న‌వ‌త‌రం స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది. నిఖిల్ స‌ర‌స‌న‌ `సూర్య వర్సెస్ సూర్య` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన‌ త్రిధా చౌద‌రి యువ‌హీరో స‌ర‌సన చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత‌ `మనసుకు నచ్చింది` అనే చిత్రంలోనూ న‌టించింది. వ‌రుస‌గా చిన్న బ‌డ్జెట్ సినిమాల‌తో యూత్ కి చేరువైంది. సెవెన్.. అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి చిత్రాల‌తో ఇటీవ‌లే తెలుగు ప్రేక్ష‌కులకు చేరువైంది. అయితే ఆశించిన విజ‌యాలు మాత్రం ద‌క్క‌లేదు.

ఇటీవ‌ల డిజిట‌ల్ ప్ర‌పంచం ఈ ప్ర‌తిభావ‌నికి అవ‌కాశాలిస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ సినిమాలతోనే బిజీ అవుతోంది. నిజానికి హిందీలో సీరియల్స్ చేసుకుంటూ బుల్లితెరపైనా ఓ వెలుగు వెలుగుతున్న ఈ బ్యూటీ స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ తో యూత్ లోకి దూసుకెళ్లింది. ఈ సిరీస్ ఆద్యంతం వేడెక్కించే లిప్ లాక్ ల‌తో త్రిధా మంట‌లు పుట్టించింది. వెబ్ ప్ర‌పంచంలో త్రిధాకు అవ‌కాశాలు పెరిగాయి. ఫిల్మీనేప‌థ్యం ఎఫైర్ కంటెంట్ తో స్పాట్ లైట్ ర‌క్తి క‌ట్టించ‌డంతో త్రిథా పేరు మార్మోగింది.

తాజాగా ఈ బ్యూటీ షంషేరా అనే భారీ చిత్రంలోనూ ఆఫ‌ర్ అందుకుంది. మ‌రోవైపు త్రిథా వ‌రుస ఫోటోషూట్ల‌తో ఆక‌ర్షిస్తోంది. ఇటీవ‌ల‌ సోషల్ మీడియాల్లో బికినీ ఫోటోషూట్స్ తో చెల‌రేగుతోంది. త్రిధా తాజా ఫోటోషూట్ అంతే వైర‌ల్ గా మారింది. త్రిథా అలా ఒంట‌రి దీవుల విహారంలో స్ట‌న్నింగ్ ఫోజ్ తో వేడెక్కించింది. ఇంత‌కుముందు గోవా డైరీస్ పేరుతో వ‌రుస‌గా బికినీ ఫోటోల‌ను షేర్ చేసిన త్రిధా చౌద‌రి ఇప్పుడు మ‌ళ్లీ ఎక్స్ క్లూజివ్ ఫోటోల‌ను షేర్ చేస్తూ హీటెక్కిస్తోంది.

ఇబిజ‌.. ఆఫ్రికా దీవుల నుంచి ఇంత‌కుముందు త్రోబ్యాక్ ఫోటోల‌ను షేర్ చేసింది. ఇప్పుడు ఫ్లోర‌ల్ బికినీలో ఫోటోషూట్ ఎక్క‌డి నుంచి అన్న‌ది రివీల్ కావాల్సి ఉంది. త్రిధా అటు త‌మిళంలోనూ వ‌రుస చిత్రాల్లో న‌టించేందుకు క‌థ‌లు వింటోంద‌ని స‌మాచారం. మ‌రోవైపు వరుస‌గా ప‌లు వెబ్ సిరీస్ ల‌లోనూ త్రిధా రెడీ అవుతోంద‌ని స‌మాచారం.