Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బికినీలో నిఖిల్ హీరోయిన్

By:  Tupaki Desk   |   10 Nov 2017 8:09 AM GMT
ఫోటో స్టోరి: బికినీలో నిఖిల్ హీరోయిన్
X
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఇచ్చే షాకులు అంతా ఇంతా కాదు. డిఫెరెంట్ క్యారెక్టర్స్ చేస్తే ఆ హంగామా ఓ స్థాయిలో ఉంటుంది. కానీ అందాల డోస్ పెంచితే మాత్రం ఏ స్థాయిలో ఉంటుందో ఎవరూ చెప్పలేరు. మొన్నటి వరకు చీరలో కనిపించిన ముద్దుగుమ్మలు సడన్ గా బికినిలో కనిపిస్తే ఆ కిక్కు మాములుగా ఉండదు. అయినా ఈ రోజుల్లో అవన్నీ కామన్ కానీ ఊహించని వారు కూడా బికినీ లు వేస్తే షాక్ అవ్వకుండా ఉండలేకపోతున్నారు కుర్రకారు.

అయితే ఇప్పుడు అదే తరహాలో నిఖిల్ సినిమాలో కనిపించిన ఒక హీరోయిన్ బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం నిఖిల్ హీరోగా తెరకెక్కిన సూర్య vs సూర్యా సినిమాలో హీరోయిన్ గా నటించిన త్రిధా చౌదరి ఇటీవల స్విమ్ సూట్ లో దర్శనం ఇచ్చింది. ఎప్పుడు విదేశాల్లో టూర్ లతో బిజీగా ఉండే త్రిధా రీసెంట్ గా ఒక బీచ్ లో దిగిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సెక్సీగా వి షేప్ అందాలతో కుర్రకారు మతులను పొగొట్టేసింది.

అమ్మడు ఇంతకుముందు కూడా కొన్ని సార్లు బికినీ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా మరి ఇంత ఘాటుగా లేవు. అయినా ఫొటోలో మాత్రం త్రిధా చాలా అందంగా కిక్ ఇచ్చిందనే చెప్పాలి. సూర్య vs సూర్యా సినిమాలో చాలా సింపుల్ గా ఉన్న ఈ బెంగాలీ భామను ఇలా సడన్ గా తెలుగు ప్రేక్షకులు చూసేసరికి అసలు ఆ ఆమ్మాయేనా ? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ఈమె సందీప్ కిషన్ హీరోగా మంజుల ఘట్టమనేని డైరక్షన్లో రూపొందుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనుంది.