Begin typing your search above and press return to search.

రెండో సినిమాకే ఇంత రచ్చా?

By:  Tupaki Desk   |   10 Jan 2018 4:10 AM GMT
రెండో సినిమాకే ఇంత రచ్చా?
X
బాలీవుడ్ సినిమాల్లో భామలు టూ పీస్ బికినీలతో కనిపించి ప్రేక్షకుల గుండెల్లో సెగ పుట్టించడం మామూలే. సౌత్ లో ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈమధ్య స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో స్విమ్ సూట్ లో కనిపించిన పూజా హెగ్డే అందరి మతులు పోగొట్టేసింది. అంతవరకు సంప్రదాయకంగా కనిపించిన పూజా ఇమేజ్ నే మార్చేసింది. ఇప్పుడు మరో భామ అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేసే రీతిలో రచ్చ చేస్తోంది.

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా మనసుకు నచ్చింది. ఇందులో త్రిధ చౌదరి.. అమైరా దస్తూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో త్రిధ ఇంతకుముందు తెలుగులో నిఖిల్ హీరోగా వచ్చిన సూర్య వెర్సస్ సూర్యలో హీరోయిన్ గా నటించింది. అందులో నార్మల్ గానే కనిపించిన త్రిధ ఈ సినిమాకొచ్చేసరికి రెచ్చిపోయింది. సముద్రం ఒడ్డున టూ పీస్ బికినీలా అలా నడుచుకుంటూ వస్తున్న సీన్లను చూస్తే ఎవరికైనా గొంతు తడారిపోవడం ఖాయం. సాధారణంగా కొత్తగా పేరు తెచ్చుకుంటున్న నాయికలు కొంచెంకొంచెగా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తారు. కానీ త్రిధ మాత్రం రెండో సినిమాలోనే మాగ్జిమం అందాలను వెండితరపై ధారాళంగా ఆరబోసేసింది.

ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల సినిమాకు మనసుకు నచ్చింది డైరెక్టర్. ఆనంది ఆర్ట్ ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా ఇందిర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆమే ఈ సినిమా స్వయంగా నిర్మిస్తోంది. సంక్రాంతి పండగ హడావుడి తగ్గాక ఈ నెల చివరి వారంలో ఈ రొమాంటిక్ కామెడీ మూవీ థియేటర్లకు రానుంది. త్రిధ అందాలు ఈ సినిమాకు ఎంతవరకు అస్సెట్ అవుతాయో చూడాలి మరి?