Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సూర్య వ‌ర్సెస్ బికినీ

By:  Tupaki Desk   |   29 Aug 2018 9:41 AM IST
ఫోటో స్టోరీ: సూర్య వ‌ర్సెస్ బికినీ
X
ఇంతందాన్ని చూశాక సూర్యుడికైనా క‌న్ను కుట్టాల్సిందే. త‌న‌ని ప్రార్థించిన‌ భ‌క్తురాలు కుంతీతో సూర్యుడి సంగ‌మం వ‌ల్ల‌ క‌ర్ణుడు జ‌న్మించాడ‌ని పురాణేతిహాసాలు చెప్పాయి. కానీ ఇదిగో ఈ అమ్మ‌డి వీక్ష‌ణ చూస్తుంటే సూర్యుని కోసం వేచి చూస్తున్న కుంతిలానే ఉంది. ఆ సూర్యుని నులివెచ్చ‌ని కిర‌ణాలు దేహ‌శిరుల్ని తాకేందుకు దూసుకొస్తున్న వేళ ఇలా బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చింది.

ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే .. నిఖిల్ క‌థానాయిక త్రిధా చౌద‌రి. `సూర్య వ‌ర్సెస్ సూర్య` చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. ఆ సినిమాలో ఈ అమ్మ‌డి అంద‌చందాలు తెలుగు యువ‌త మ‌న‌సు దోచాయి. అయితే త్రిధాకు ఆ త‌ర్వాత ఆశించిన‌న్ని అవ‌కాశాలు అయితే రాలేదు. ప్ర‌స్తుతం ఇరుగుపొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంది. 2018లో బెంగాళీలో ఓ రెండు సినిమాలు చేసిన ఈ భామ తెలుగులో `మ‌న‌సుకు న‌చ్చింది` అనే చిత్రంలో న‌టించింది. అయితే ఆ సినిమా కూడా ఫ్లాపైంది.

ప్ర‌స్తుతం ఇదిగో ఇలా పూల్ సైడ్ బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ ఫోటో యూత్‌ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. త్రిధా రెగ్యుల‌ర్‌ గా ఇలాంటి ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్‌ లో ఉంటోంది. అన్న‌ట్టు ఈ త‌ర‌హా వేడెక్కించే వ్య‌వ‌హారం ఉన్నా త్రిధాకు ఎందుక‌ని ఛాన్సులు ఆర‌వ‌డం లేదో! క‌నీసం ఈసారైనా.. త్రిధాకి ఓ క్రేజీ ఆఫ‌ర్ ల‌భిస్తుందేమో చూడాలి.