Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టూపీస్ లో గుబులు రేపిన కుర్ర‌బ్యూటీ

By:  Tupaki Desk   |   12 March 2021 1:39 PM IST
ఫోటో స్టోరి:  టూపీస్ లో గుబులు రేపిన కుర్ర‌బ్యూటీ
X
`సూర్య వర్సెస్ సూర్య` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది త్రిధా చౌద‌రి. యంగ్ హీరో నిఖిల్ స‌ర‌సన చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత‌ `మనసుకు నచ్చింది` అనే చిత్రంలోనూ న‌టించింది. వ‌రుస‌గా చిన్న బ‌డ్జెట్ సినిమాల‌తో యూత్ కి చేరువైంది. సెవెన్.. అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి చిత్రాల‌తో ఇటీవ‌లే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కానీ ఇవేవీ త‌న‌కు కెరీర్ ప‌రంగా ప్ల‌స్ కాలేదు.

క్యూట్ లుక్స్ వేడెక్కించే వడ్డ‌న‌లు ఈ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. ఈ భామ ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉంది. అక్కడ సీరియల్స్ చేసుకుంటూ బుల్లితెరపైనా వెలుగుతోంది. స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ తో త్రిధా పేరు ఇటీవ‌ల మార్మోగింది. ఈ సిరీస్ ఆద్యంతం వేడెక్కించే లిప్ లాక్ ల‌తో త్రిధా మంట‌లు పుట్టించింది. వెబ్ ప్ర‌పంచంలో ఈ అమ్మ‌డి కెరీర్ కి డోఖా లేనంత ట్రీట్ ని ఇచ్చింది. ఫిల్మీనేప‌థ్యం ఎఫైర్ కంటెంట్ తో స్పాట్ లైట్ ర‌క్తి క‌ట్టించ‌డంతో ప్ర‌స్తుతం ముంబై వ‌ర్గాల్లో త్రిథా పేరు మార్మోగుతోంది. తాజాగా ఈ అమ్మ‌డు షంషేరా అనే భారీ చిత్రంలోనూ ఆఫ‌ర్ అందుకుంది.

ఇదే హుషారులో ఇన్ స్టా వేదిక‌గా వ‌రుస ఫోటోషూట్ల‌తో ఆక‌ర్షిస్తోంది. ఇటీవ‌ల‌ సోషల్ మీడియాల్లో బికినీ ఫోటోషూట్స్ తో చెల‌రేగుతోంది. త్రిధా తాజా ఫోటో అంతే వైర‌ల్ గా మారింది. బీచ్ వెకేష‌న్ లో ఉన్న త్రిధా టూపీస్ షో యూత్ లోకి దూసుకెళుతోంది. బీచ్ ప‌రిస‌రాల్లో త్రిథా స్వేచ్ఛా విహారం ఒక‌ర‌కంగా అగ్గి రాజేసింది. పింక్ టాప్.. ఫ్లోర‌ల్ బాట‌మ్ లైన్ తో త్రిథా వేడెక్కించే అవ‌తారం సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది. ఈ స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్ లో మ‌రోమారు త్రిథాకి ఆఫ‌ర్లు ఖాయంగానే క‌నిపిస్తోంది.