Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: వెంక‌టేష్ 75 ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   18 July 2021 5:09 AM GMT
ట్రెండీ టాక్‌: వెంక‌టేష్ 75 ద‌ర్శ‌కుడు ఎవ‌రు?
X
విక్ట‌రీ వెంక‌టేష్ బ్యాక్ టు బ్యాక్ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అత‌డు న‌టించిన `నార‌ప్ప - దృశ్యం 2` చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. థియేటర్ల‌లో రిలీజ్ కి రాక‌పోవ‌డంతో అభిమానులు నిరాశ చెందిన సంగ‌తి తెలిసిందే. వెంకీ ఇలా జ‌రుగుతున్నందుకు అభిమానుల‌కు సారీ చెప్పారు. త‌న త‌దుప‌రి చిత్రాలు థియేట్రిక‌ల్ రిలీజ్ కి వ‌స్తాయ‌ని తెలిపారు.

మ‌రోవైపు విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం ఎఫ్ 3లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఎఫ్ 2 కి సీక్వెల్ గా వ‌స్తున్నా ఈ సినిమా క‌థాంశం పూర్తి వైవిధ్యంగా ఉంటుంద‌ని అనీల్ రావిపూడి వెల్ల‌డించారు. ఈ సినిమా త‌ర్వాత వెంకీ త‌న కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ వెంక‌టేష్ 75 చేస్తారు? అన్నదానిపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. త‌న కెరీర్ 75వ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తార‌ని ప్ర‌చారం సాగుతున్నా అది సాధ్య‌ప‌డ‌లేదు. దీనిపై వెంకీ మాట్లాడుతూ.. టైమ్ క‌లిసొస్తే సాధ్య‌ప‌డుతుంది.. స్క్రిప్టు నిర్ణ‌యిస్తుంది. నా చేతిలో ఏమీ లేదు! అని తెలిపారు.

త్రివిక్ర‌మ్ బిజీ బిజీ

మ‌రోవైపు త్రివిక్ర‌మ్ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ తో సినిమా కోసం క‌స‌ర‌త్తు చేస్తున్న త్రివిక్ర‌మ్ త‌దుప‌రి ఎన్టీఆర్ .. అల్లు అర్జున్ .. ప‌వ‌న్.. చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసేందుకు స్క్రిప్టుల్ని రెడీ చేస్తున్నారు. రామ్ తోనూ ఓ సినిమా ఉంటుంద‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. ఈ నేప‌థ్యంలో వెంకీతో సినిమా అంటే దానికి క‌చ్ఛిత‌మైన స్ప‌ష్ఠమైన‌ ప్ర‌ణాళిక‌తో వ‌స్తేనే సాధ్య‌మ‌ని భావించాల్సి ఉంటుంది. విక్ట‌రీ వెంక‌టేష్ తో నువ్వు నాకు న‌చ్చావ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ ఆ రేంజు స్క్రిప్టు కోసం వేచి చూస్తున్నారు.