Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: 2021 సాయి ప‌ల్ల‌వి ఖాతాలోకే..!

By:  Tupaki Desk   |   20 March 2021 3:06 AM GMT
ట్రెండీ టాక్‌: 2021 సాయి ప‌ల్ల‌వి ఖాతాలోకే..!
X
2020 మ‌హ‌మ్మారీ క్రైసిస్ భ‌యాల నుంచి బ‌య‌ట‌ప‌డి టాలీవుడ్ నెమ్మదిగా కోలుకుంటోంది. ఉప్పెన - నాంది- జాతిర‌త్నాలు లాంటి చిత్రాలు చ‌క్క‌ని విజ‌యాలు సాధించ‌డంతో త‌దుప‌రి రిలీజ‌య్యే చిత్రాల‌పైనా జ‌నాల ఫోక‌స్ ఎక్కువ‌గానే ఉంది.

ప్ర‌స్తుతం ఓ రెండు చిత్రాల గురించి టాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరి.. వేణు ఉడుగుల‌ రూపొందిస్తున్న విరాఠ‌ప‌ర్వం చిత్రాల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ రెండు సినిమాల‌పైనే జ‌నాల ఫోక‌స్ ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆ రెండిటిలో న‌టిస్తున్న కామ‌న్ క‌థానాయిక సాయి ప‌ల్ల‌వి.

ఈ రెండు సినిమాల టీజ‌ర్లు ఇప్ప‌టికే ఆడియెన్ లోకి దూసుకెళ్లాయి. సాయి ప‌ల్ల‌వి అద్భుతమైన పెర్ఫామెన్స్ ముందు హీరోలంతా చిన్న‌బోయార‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక సాయి ప‌ల్ల‌వి ఏ సినిమాలో న‌టించినా ఆ సినిమాకి త‌నే పెద్ద ప్లస్. ఒకే ఒక్క సారంగ ద‌రియా సాంగ్ తో ల‌వ్ స్టోరి కి ఒక్క‌సారిగా హైప్ వ‌చ్చిందంటే ఆ క్రెడిట్ సాయిప‌ల్ల‌వి ఖాతాలోకే.. త‌న అద్భుత‌ డ్యాన్సింగ్ విన్యాసాలు.. ప్ర‌తిభ సినిమాకి పెద్ద ప్ల‌స్ కానుంది. ‌

తాజాగా విరాఠ‌ప‌ర్వం టీజ‌ర్ లోనూ సాయిప‌ల్ల‌వి మాస్ ట్రీట్.. తెలంగాణ యాస యూత్ కి గొప్ప‌గా క‌నెక్ట‌యిపోయాయి. విలేజీ అమ్మాయిగా ఇంటెన్స్ పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకుంది. ఈ రెండు సినిమాలకు సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన బ‌లం. కేవ‌లం కొన్ని వారాల‌ వ్య‌వ‌థిలోనే ఈ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో సాయిప‌ల్ల‌వి బెస్ట్ పెర్ఫామెన్స్ చూసే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఆ త‌ర్వాత నాని శ్యామ్ సింఘ‌రాయ్ లోనూ సాయిప‌ల్ల‌వి ప్ర‌ద‌ర్శ‌న స్పెష‌ల్ ట్రీట్ కానుంది.

ఏ కోణంలో చూసినా 2021 ఉత్త‌మ నాయిక ఎవ‌రు? అంటే.. నిర‌భ్యంత‌రంగా సాయి ప‌ల్ల‌వి అని బ్లైండ్ గా ఫిక్స‌వ్వాల్సిందే. కేవ‌లం టీజ‌ర్ల‌తోనే రౌడీ బేబీపై అంత మంచి టాక్ వినిపించింది. ఇక పూర్తి సినిమాల్లో సాయిప‌ల్ల‌వి పెర్ఫామెన్స్ ఏ రేంజులో ఉంటుందోన‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.