Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: ఖాన్ లను కొట్టే ఒకే ఒక్క మొనగాడు...?
By: Tupaki Desk | 17 April 2021 8:00 AM ISTపాన్ ఇండియా హీరోగా ప్రభాస్ రేంజ్ గురించి జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. అతడు ఖాన్ లను కొట్టే మొనగాడు అవుతున్నాడు! అంటూ అభిమానుల్లో ఒకటే డిస్కషన్ సాగుతోంది. నిజానికి ప్రభాస్ స్టార్ డమ్ అంతకంతకు స్కైని టచ్ చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఏమాత్రం మ్యాటర్ లేదని తీసిపారేసిన సాహో చిత్రం బాక్సాఫీస్ వద్ద కురిపించిన కలెక్షన్ల సునామీనే అందుకు సాక్ష్యంగా నిలిచింది. ఈ సినిమా తెలుగు తమిళం కంటే హిందీలో పెద్ద హిట్టయ్యిందంటే ఉత్తరాదిన డార్లింగ్ ప్రభాస్ క్రేజుకు అది సాక్ష్యంగా నిలిచింది.
అందుకే ఇప్పుడు అతడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ ఒకేసారి ఐదారు పాన్ ఇండియా సినిమాలపై వర్క్ చేస్తున్నారు. ఆదిపురుష్ 3డి- సలార్ సైమల్టేనియస్ గా తెరకెక్కుతుంటే నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం పకడ్భందీ వ్యూహం రచిస్తున్నాడు. అలాగే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని అది వార్ సీక్వెల్ అని కూడా ప్రచారం ఉంది. మరోవైపు యష్ రాజ్ ఫిలింస్ కూడా ప్రభాస్ ని లాక్ చేసి ఒక భారీ సీక్వెల్ లో నటింపజేయాలని ప్రయత్నిస్తోంది. ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ తో వేరొక క్రేజీ యాక్షన్ చిత్రం చేయనున్నారని ప్రచారమవుతోంది.
ఇదంతా చూస్తుంటే అతడి లైనప్ ఖాన్ లకు ధీటుగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే షారూక్ ఖాన్ పరాజయాలతో వెలగలేకపోతుంటే సల్మాన్ రొటీన్ యాక్షన్ చిత్రాలకే పరిమితమవుతున్నారన్న విమర్శ ఉంది. మరోవైపు అమీర్ ఖాన్ ఒకటీ అరా మాత్రమే చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒకేసారి ఐదారు అత్యంత క్రేజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రతిదీ దేనికదే ప్రత్యేకమైన కథాంశాలతో విలక్షణంగా కనిపిస్తున్నాయి. అందుకే అతడి దూకుడు ఇకపైనా కొనసాగుతుందనే అంచనా వేస్తున్నారు. 50 ప్లస్ లతో ఏజ్ అయిపోయిన ఖాన్ లతో పోలిస్తే ప్రభాస్ ఇప్పటికీ ఇంకా 40లో ఉన్నాడు. అది కూడా అతడికి పెద్ద ప్లస్ కానుంది. బాహుబలి స్టార్ గా అతడికి పెరిగిన క్రేజు ఇంకో దశాబ్ధ కాలం పని చేసినా ఆశ్చర్యం అక్కర్లేదు.