Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: వెంకీ కోసమే తరుణ్ వెయిటింగ్
By: Tupaki Desk | 22 Nov 2020 9:49 AM GMTవిక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప చిత్రీకరణ మహమ్మారీ లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన సంగతి విధితమే. ఈ సినిమా టాకీ చిత్రణపై పూర్తి క్లారిటీ వచ్చేందుకు కాస్తంత సమయం పడుతుంది. తదుపరి వరుసగా సినిమాలకు సంతకాలు చేసేందుకు వెంకీ సిద్ధంగా ఉన్నారు.
గత కొంతకాలంగా వెంకటేష్ తో ఆఫర్ కోసం పెళ్లిచూపులు ఫేం తరుణ్ భాస్కర్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కొన్ని నెలలుగా నిర్మాత డి.సురేష్ బాబుతో ఈ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ తో ఒప్పందం కుదిరింది. ఈ నగరానికి ఏమైంది? తర్వాత అదే బ్యానర్ లో తనకు ఆఫర్ దక్కినందుకు తరుణ్ ఎంతో ఎగ్జయిట్ అయ్యాడు కూడా. కానీ ఇన్నాళ్ల వరకూ ఏదీ ముందుకు సాగలేదు.
తాజా సమాచారం ప్రకారం.. వెంకీ కోసం తరుణ్ అదిరిపోయే స్క్రిప్టు రాశారట. గుర్రపు పందెం నేపథ్యంలో ఆసక్తికరమైన స్క్రిప్ట్ రెడీ చేసి గత సంవత్సరం వెంకీకి వివరించాడు. వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో తరుణ్ భాస్కర్ ఇప్పుడు తన ప్రణాళికలను పూర్తిగా మార్చుకున్నాడట. వెంకీతో మరో కొత్త కథకు సంబంధించిన చర్చలు జరుపుతున్నాడని తెలిసింది.
విక్టరీ వెంకటేష్ ఇమేజ్ ను లేడీ ఫాలోయింగ్ ని పరిగణనలోకి తీసుకొని అవుట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ స్టోరీని రాశాడట. అతను స్క్రిప్ట్ ను వెంకటేష్- సురేష్ బాబులకు కూడా వివరించాడు. వారు సానుకూలంగానే స్పందించారని ప్రస్తుతం బౌండ్ స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందని తరుణ్ భాస్కర్ చెప్పారు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. డిసెంబర్ నుండి ఎఫ్ 3 సెట్స్ కి వెళుతుంది. అటుపై తరుణ్ తో సినిమాని ప్లాన్ చేయనున్నారుట.