Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: చిట్టి ఫ‌రియా జాక్ పాట్

By:  Tupaki Desk   |   30 May 2021 6:30 AM GMT
ట్రెండీ టాక్: చిట్టి ఫ‌రియా జాక్ పాట్
X
హైద‌రాబాదీ అమ్మాయి ఫ‌రియా అబ్ధుల్లా ఓవ‌ర్ నైట్ స్టార్ గా వెండితెర‌పై వెలిగిన సంగ‌తి తెలిసిందే. జాతి రత్నలు చిత్రంలో త‌న‌దైన క్యూట్ లుక్స్ .. ఎక్స్ ప్రెష‌న్స్ తో ఆక‌ట్టుకున్న ఫ‌రియాకి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులేర్ప‌డ్డారు. మొద‌టి హిట్టు అందుకున్న త‌ర్వాత ఇన్ స్టా వేదిక‌గా నిరంత‌రం డ్యాన్సింగ్ వీడియోల‌ను షేర్ చేస్తూ చిట్టి ఫ‌రియా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ఈ వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

అయితే ఓవ‌ర్ నైట్ స్టార్ ఫ‌రియా త‌న రెండో సినిమాని ఇంకా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఫ‌రియా ఎడా పెడా ఏదో ఒక స్క్రిప్టు వినేసి ఓకే చేసేందుకు సిద్ధంగా లేద‌ట‌. అందివ‌చ్చిన హిట్టును స‌ద్వినియోగం చేసుకుంటూ ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్ లో ప్ర‌ముఖ హీరో స‌ర‌స‌న న‌టించేందుకు రెడీ అవుతోంద‌ట‌. అందుకే త‌న రెండో సినిమాని స్వ‌యంగా ప్ర‌క‌టించ‌లేద‌ని తెలిసింది.

ప్ర‌ముఖ దర్శకుడు దర్శకత్వం వహించబోయే ఈ సీక్వెల్ కోసం చర్చలు సాగుతున్నాయ‌ట‌. అతి త్వరలో ఆ ప్ర‌ముఖ‌ హీరో ఎవ‌రు? అలాగే ప్రాజెక్ట్ క‌థాక‌మామీషు ఏమిట‌న్న‌ వివరాలు బయటికి వస్తాయి. అధికారికంగా చిత్ర‌బృంద‌మే ఫ‌రియాను క‌థానాయిక‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందిట‌. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో ఫరియాకు బిగ్ బ్రేక్ నిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు జాతిర‌త్నాలు సీక్వెల్ లోనూ ఫరియా త‌న పాత్ర‌కు కొన‌సాగింపు భాగంలో న‌టిస్తుంది.