Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: చై-సామ్ మ‌రోసారి జంట‌గా..!

By:  Tupaki Desk   |   21 May 2021 8:30 AM GMT
ట్రెండీ టాక్‌: చై-సామ్ మ‌రోసారి జంట‌గా..!
X
కెరీర్ లో ఎన్ని బ్లాక్ బ‌స్ట‌ర్లు ఉన్నా నాగ‌చైత‌న్య‌- స‌మంత ఇద్ద‌రికీ `మ‌జిలీ` ఎంతో ప్ర‌త్యేక‌మైన చిత్రం. ల‌వ్ ఎమోష‌న‌ల్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్ర‌మిది. నాగ‌చైత‌న్య - స‌మంత జంట న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది.

మ‌జిలీ స‌క్సెస్ త‌ర్వాత సీక్వెల్ ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ప్రక‌టించారు. కానీ దానిపై ఇటీవ‌ల ఎలాంటి స‌మాచారం లేదు. తాజా స‌మాచారం మేర‌కు ఈ జంట క‌లిసి న‌టిస్తారు. అయితే అది మ‌జిలీ సీక్వెల్లో కాదు. క‌ళ్యాణ్ కృష్ణ `బంగార్రాజు`లో నాగ చైతన్య - సమంతా కలిసి నటించనున్నారు. ఇప్ప‌టికే ఈ జంట‌ స్క్రిప్ట్ విని ఓకే చెప్పార‌ని తెలిసింది. నాగ్ - ర‌మ్య‌కృష్ణ ప్రధాన పాత్ర‌ధారులుగా కళ్యాణ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీ 2016 సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్. మహమ్మారి ప‌రిస్థితులు స‌ద్ధుమ‌ణిగాక షూటింగ్ ప్రారంభమవుతుంది.

చైతూ ప్ర‌స్తుతం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్న `థాంక్యూ` చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నారు. మరో చిత్రం `లవ్ స్టోరీ` విడుదలకు సిద్ధంగా ఉంది. సమంత తదుపరి `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` అనే వెబ్ సిరీస్ లో కనిపిస్తుంది. శాకుంతలం -కాథువాకుల రేండు కాదల్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.