Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: యంగ్ ట్యాలెంటెడ్ హీరోకి మ‌రో బిగ్ జోల్ట్?

By:  Tupaki Desk   |   30 May 2021 7:30 AM GMT
ట్రెండీ టాక్: యంగ్ ట్యాలెంటెడ్ హీరోకి మ‌రో బిగ్ జోల్ట్?
X
యంగ్ ట్యాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ ఇటీవ‌ల ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ నుంచి సృజ‌నాత్మ‌క వ్య‌త్యాసాల కార‌ణంగా వైదొల‌గిన సంగ‌తి తెలిసిందే. అత‌డి క్ర‌మ‌శిక్ష‌ణ‌ను నిందిస్తూ సీక్వెల్ మూవీ `దోస్తానా 2` నుంచి తొల‌గిస్తున్నామ‌ని.. ధ‌ర్మాధినేత క‌ర‌ణ్ జోహార్ ఇక‌పై త‌న‌తో ప‌ని చేయ‌లేర‌ని ప్ర‌క‌టించారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ కి సంబంధించి అత‌డికి ఇక డోర్స్ క్లోజ్ అయిన‌ట్టేన‌ని సంబంధిత వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

దీంతో ప్ర‌తిభావంతుడైన కార్తీక్ ఆర్య‌న్ విష‌యంలో ఏం జ‌రుగుతోంది? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు మ‌రో పెద్ద సంస్థ నుంచి అత‌డు అవ‌కాశాన్ని చేజార్చుకోవ‌డం మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈసారి అత‌డికి ద‌ర్శ‌కుడితో విభేధాలొచ్చాయి. షారూఖ్ కి చెందిన రెడ్ చిల్లీస్ సంస్థ ఈ మూవీని తెర‌కెక్కిస్తోంది. ఇది ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని తెలిసింది.

తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. కార్తీక్ చిత్ర దర్శకుడు అజయ్ బహ్ల్ తో సృజనాత్మక సమస్యలు బ‌య‌ట‌పడ్డాయి. ద‌ర్శ‌కుడు వినిపించిన‌ స్క్రిప్ట్ విష‌యంలో అత‌డు సంతోషంగా లేడు. స్క్రిప్ట్ బాలేద‌ని కార్తీక్ తన అసంతృప్తిని బాహ్ల్ కు వ్యక్తం చేశాడు. గత 15 రోజుల్లో ఇరువురి న‌డుమా సృజనాత్మక వ్యత్యాసం పెరిగిందని తెలుస్తోంది. ఎంపికైన‌ తారాగణం గురించి కూడా కార్తీక్ ఆందోళన వ్య‌క్తం చేశార‌ట‌. చిత్ర‌క‌థానాయిక క‌త్రిన ఏజ్ ప‌రంగా త‌న‌కంటే ఓల్డ్ గా క‌నిపిస్తుంద‌ని కార్తీక్ ఆర్య‌న్ ఆరోపించార‌ట‌. అయితే ఇలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అత‌డి తొల‌గింపు గురించి రెడ్ చిల్లీస్ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఇప్ప‌టికే ఈ సినిమా సెట్స్ పై ఉంది. 20 రోజుల చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసారు. ఒక‌వేళ ఈ మూవీ నుంచి హీరో మారితే అది ఈజీగానే అంద‌రికీ తెలిసిపోతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.