Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: స‌ర్వేల్లో అక్కినేని కోడ‌లు స‌మంత‌ హ‌వా

By:  Tupaki Desk   |   16 July 2021 11:30 PM GMT
ట్రెండీ టాక్‌: స‌ర్వేల్లో అక్కినేని కోడ‌లు స‌మంత‌ హ‌వా
X
అంత‌ర్జాలంలో పాపులారిటీకి ర్యాంకింగ్స్ అవ‌స‌ర‌మా? అంటే అవున‌నే యూత్ భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టే ప‌లు సంస్థ‌లు ర్యాంకింగ్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఎవ‌రికి ఎంత ఫాలోయింగ్ ఉంది? అన్న‌ది ఈ ర్యాంకింగ్స్ చెబుతున్నాయి. టాలీవుడ్ లో టాప్ వ‌న్ నుంచి టాప్ 10 వ‌ర‌కూ ఎప్ప‌టిక‌ప్పుడు ఆ జాబితా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. టైమ్స్ స‌హా ప‌లు స‌ర్వేసంస్థ‌లు ఈ జాబితాల్ని యేటేటా రిలీజ్ చేస్తున్నాయి. సినిమాలతో స‌క్సెస్..డిజిట‌ల్ వేదిక‌ల్లో ఫాలోయింగ్ .. గూగుల్ సెర్చ్ వ‌గైరా వేదిక‌ల ఆధారంగా ఎప్ప‌టిక‌ప్పుడు జాబితాల్ని వెలువ‌రిస్తున్నాయి. క్రేజ్ ని బ‌ట్టి ఈ వేదిక‌పై ప్ర‌తిదీ మారుతుంటుంది. కేవ‌లం తెలుగు సినిమాలు టార్గెట్ గానే కాకుండా ఇత‌ర భాష‌ల్లో గుర్తింపును సైతం ప‌లు స‌ర్వే సంస్థ‌లు అంచ‌నా వేసి ర్యాకింగ్స్ ని  ఇస్తున్నాయి. తాజాగా ముంబైకి చెందిన‌ ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా  ఈ ఏడాది జూన్ నెలకు గాను టాప్ 10 తెలుగు హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది.

ఇందులో అక్కినేని కోడ‌లు.. అగ్ర‌క‌థానాయిక‌ స‌మంత నెంబ‌వ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకున్నారు. తెలుగు స్టార్స్ ఫీమేల్ క్యాట‌గిరీలో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ గా ఆమె నిలిచారు. సామ్ ఇటీవ‌లే చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్స్ జాబితాలోనూ టాప్ 1 గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఓర్మాక్స్ జాబితాలోనూ నంబ‌ర్ వ‌న్ గా నిలిచారు. మునుప‌టితో పోలిస్తే స‌మంత సినిమాల ప‌రంగా స్పీడ్ త‌గ్గించిన‌ప్ప‌టికి తెలుగింట ఫ్యామిలీ ఆడియెన్ మెచ్చే నాయిక‌గా గొప్ప ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇటీవ‌ల వెబ్ సిరీస్ లు వెబ్ షోల‌తోనూ గొప్ప పాపులారిటీ పెరిగింది. సాటి నాయిక‌ల‌తో పోలిస్తే స‌మంత‌కు స‌క్సెస్ రేటు కూడా అమాంతం పెర‌గ‌డం క‌లిసొస్తోంది. ప్రస్తుతం స‌మంత `శాకుంత‌లం` స‌హా ప‌లు క్రేజీ తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల‌ అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీమ్యాన్ 2 సిరీస్ తోనూ సామ్ కి గొప్ప పేరొచ్చింది. స‌మంత ప్ర‌స్తుతం కొన్ని త‌మిళ్ సినిమాలు చేస్తున్నారు.

ఇక ఈ జాబితాలో రెండ‌వ స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ నిల‌వ‌డం విశేషం. కెరీర చ‌ర‌మాంకంలో ఉన్నా చంద‌మామ‌ ఇంకా టాప్ 10 లో నిల‌వ‌డం విశేష‌మే. ప్ర‌స్తుతం కాజ‌ల్ మెగాస్టార్ స‌ర‌స‌న‌ `ఆచార్య‌`లో న‌టిస్తున్నారు. భారతీయుడు 2 లోనూ నాయిక‌. వెబ్ సిరీస్ లు స‌హా టీవీ షోల‌కు కాజ‌ల్ ప్లాన్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఇక స్వీటీ అనుష్క కొంత‌కాలంగా సినిమాలు త‌గ్గించినా జాబితాలో మూడ‌వ స్థానంలో నిలిచారు. చివ‌రిగా నిశ‌బ్ధం త‌ర్వాత స్వీటీ మ‌రో సినిమా చేయ‌లేదు. చేతిలో అవ‌కాశాలున్నా సెల‌క్టివ్ గా వెళ్తున్నారు. ఇక మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా నాల్గ‌వ ర్యాంక్ లో నిలిచారు. మిల్కీ బ్యూటీ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం  `గుర్తుందా శీతాకాలం`.. `మ్యాస్ట్రో`.. `ఎఫ్ 3` చిత్రాల్లో న‌టిస్తున్నారు.

బాలీవుడ్ లో పాగా వేయాల‌ని చూస్తున్న వ్వాటే బ్యూటీ రష్మిక మంద‌న ఐద‌వ స్థానంలో నిలిచారు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప` లో న‌టిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో ఏకంగా మూడు సినిమాల‌కు ర‌ష్మిక క‌మిట‌య్యారు. ప్ర‌స్తుతం మిష‌న్ మ‌జ్ను- గుడ్ బాయ్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.

ఇక స‌క్సెస్ ముఖం చాటేస్తున్నా కీర్తి సురేష్ ఆర‌వ స్థానం లో నిల‌వ‌డం విశేషం. ప్ర‌స్తుతం మ‌హేష్ `స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌`లో న‌టిస్తున్నారు. అలాగే పూజాహెగ్దే ఏడ‌వ స్థానంలో నిలిచారు. న‌టిగా ఆమె చాలా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `రాధేశ్యామ్`, .. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` చిత్రాల‌తో పూజ బిజీగా ఉంది. ఇక ఎనిమిద‌వ స్థానంలో రాశీఖ‌న్నా.. తొమ్మిద‌వ స్థానంలో ర‌కుల్ ప్రీత్ సింగ్.. ప‌ద‌వ స్థానంలో సాయి ప‌ల్ల‌వి చోటు ద‌క్కించుకున్నారు. ఇదే సంస్థ విడుద‌ల చేసిన మేల్ స్టార్స్ జాబితాలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ మొద‌టి స్థానంలో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండ‌వ స్థానంలో నిలిచారు. టాప్ 10లో చిరు-ప‌వ‌న్ క‌ల్యాణ్-తార‌క్-నాని-దేవ‌ర‌కొండ ఉన్నారు.