Begin typing your search above and press return to search.
ట్రెండీ స్టోరి: ఓవర్ నైట్ స్టార్స్ అంటారు కానీ..!
By: Tupaki Desk | 16 May 2021 5:00 AM ISTగ్లామర్ పరిశ్రమలో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవడం అనేది కుదురుతుందా? నిజానికి పరిశ్రమలో ప్రవేశించిన తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకునేవాళ్లు చాలామంది ఉన్నారు కానీ.. మొదటి ప్రయత్నమే పెద్ద స్టార్ అన్న పేరు తెచ్చేసుకోవడం చాలా రేర్ గా సాధ్యపడేది. అరవింద స్వామిలాగా.. లేకపోతే ఉప్పెన వైష్ణవ్ తేజ్ లాగా ఆరంగేట్రమే అదృష్టం దక్కడం అన్నది అరుదు.
నిజానికి తమిళ హీరో అరవింద స్వామి తన గురువు మణిరత్నం తెరకెక్కించిన దళపతి చిత్రంలో కలెక్టర్ పాత్రలో నటించాడు. 1991లో రిలీజైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాతి సంవత్సరమే అరవింద స్వామి క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోగా మారిపోయి రోజా (1992) చిత్రంలో నటించాడు. ఆ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. జాతీయ అవార్డులు దక్కాయి. అటుపై 1995లో బొంబాయి లాంటి సెన్సేషనల్ హిట్ చిత్రంలో నటించాడు. ఇలా అతడి కెరీర్ టేకాఫ్ అయిన తీరే వేరు. పరిశ్రమలో చిరంజీవి.. రజనీకాంత్ లాంటి స్టార్లు చాలా కాలం పాటు విలన్ వేషాలు వేస్తే కానీ హీరోలు కాలేదు. పెద్ద స్టార్లు గా నిరూపించుకునేందుకు చాలా కాలం తమని తాము షైనప్ చేసుకున్నారు. అయితే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ఓవర్ నైట్ స్టార్ గా నిరూపించాడు. అతడు నటించిన తొలి చిత్రం ఉప్పెన సంచలన విజయం సాధించడంతో అతడిని పరిశ్రమతో పాటు అభిమానులు ఓవర్ నైట్ స్టార్ గానే భావించారు. ఇక ఛలో చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగేసిన రష్మిక మందన కూడా ఓవర్ నైట్ స్టార్ గానే వెలిగిపోతోంది. కన్నడలో కిర్రిక్ పార్టీతో తొలి ప్రయత్నమే బ్లాక్ బస్టర్ కొట్టి ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు-హిందీలోనూ అగ్ర హీరోలతో నటించేస్తోంది. ఇలాంటి అదృష్టం చాలా కొద్దిమందికే సాధ్యం.
నేచురల్ స్టార్ నాని అష్టా చెమ్మాతో సడెన్ గా హీరో అయ్యి ఓవర్ నైట్ స్టార్ గా పాపులరయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన నానీని హీరోని చేసిన ఘనత దర్శకుడు ఇంద్రగంటికే చెందుతుంది. ఇండస్ట్రీలో పాపులర్ నటుల్లో నాని ఇప్పుడు ఒకరు. స్వయంకృషితో ఎదిగిన స్టార్ గా వెలుగుతున్నాడు. పరిశ్రమలో సుదీర్ఘకాలం స్ట్రగుల్ ఉన్న రవితేజ .. శ్రీకాంత్ లాంటి స్టార్లతో పోలిస్తే.. నాని ఎదిగిన తీరు వేరే. ఇక అడివి శేష్ ఆల్ రౌండర్ నైపుణ్యంతో నిరూపించుకునే తీరు కానీ.. కార్తికేయ గుమ్మడిగొండ హార్డ్ వర్క్ కానీ గొప్ప పేరు తెస్తోంది వారికి. పరిశ్రమలో ప్రామిస్సింగ్ గా ఎదుగుతున్నారు.
విజయ్ దేవరకొండ.. నవీన్ పోలిశెట్టి లాంటి స్టార్లను ఓవర్ నైట్ స్టార్లుగానే అభిమానులు భావిస్తారు. కానీ ఆ ఇద్దరూ తొలి బ్లాక్ బస్టర్ కొట్టడానికి ముందే ఇండస్ట్రీలో కొంత స్ట్రగుల్ అనుభవించారు. దేవరకొండకు పెళ్లి చూపులు సోలో హిట్. కానీ అంతకుముందు క్యారెక్టర్లు చేశాడు. నవీన్ పోలిశెట్టి అతిథి పాత్రల్లో కనిపించాడు. ఏజెంట్ ఆత్రేయగా.. మెప్పించి ఇటీవల జాతిరత్నాలు తో బ్లాక్ బస్టర్ కొట్టి వరుస అవకాశాలందుకుంటున్నాడు. హృదయకాలేయం చిత్రంతో సంపూర్ణేష్ బాబు ఒక సంచలనం అయ్యారు. ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగారు. కానీ అంతకుముందు కొంత స్ట్రగుల్ ఉంది. అలాగే అతడు ప్రయోగాత్మక చిత్రాలతో ఇప్పటికీ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఆకర్షిస్తున్నాడు. ఇండస్ట్రీలో ప్రముఖ కుటుంబాల నుంచి వచ్చి ఫ్లాపైన చాలామంది హీరోలతో పోలిస్తే సంపూ చాలా బెటర్ అనిపించాడు.
బ్లాక్ బస్టర్ చిత్రాలతో అరంగేట్రం చేసి రాత్రికి రాత్రే స్టార్స్ అయిన ఐదుగురు నటుల జాబితాను పరిశీలిస్తే.. కోలీవుడ్ లో తొలి ప్రయత్నమే బ్లాక్ బస్టర్స్ కొట్టినవాళ్లలో మాధవన్ (మ్యాడీ)... కార్తీ.. జయం రవి.. ఈ ముగ్గురు హీరోల తొలి సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. పట్టుదల.. సహనంతో వారంతా స్టార్టుగా నిరూపించుకున్నారు. పరిశ్రమలో ఎదిగారు. గత రెండు దశాబ్దాలలో తమిళ సినిమా విజయ్- అజిత్- సూర్య- ధనుష్- సింబు - శివకార్తికేయన్ వంటి స్టార్లు ఉన్నా కొందరు ఓవర్ నైట్ లో పాపులరయ్యారు. కొందరు హీరోలు వారి రెండవ లేదా మూడవ చిత్రాల తర్వాత విజయాన్ని సాధించగా మరికొందరు ఓవర్ నైట్ సూపర్ స్టార్స్ అయ్యారు.
ఆర్ మాధవన్ 2000 లో ఏస్ ఫిల్మ్ మేకర్ మణిరత్నం దర్శకత్వంలో తమిళ చిత్రం `అలైపాయుతే`(చెలి) తో హీరోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో అతని అద్భుత నటన చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో మాధవన్ -శాలిని ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ డ్రామాను అభిమానులు బాగా ఆస్వాదించారు. ఆ సీజన్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.
ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ మోహన్ కుమారుడు రవిని హీరోగా పరిచయం చేస్తూ తన అన్నయ్య మోహన్ రాజా స్వీయదర్శకత్వంలో `జయం`ని రీమేక్ చేశారు. తమిళంలోనూ అదే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా రవిని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. రొమాంటిక్ డ్రామాకు మంచి సమీక్షలు వచ్చాయి. ఇది రవి కెరీర్ కు పెద్ద ప్లస్ అయ్యింది.
జితాన్ (2005) చిత్రంతో రమేష్ హీరోగా అరంగేట్రం చేశాడు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది. ఈ చిత్రం 2004 బాలీవుడ్ చిత్రం గయాబ్ కి అధికారిక రీమేక్. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన తరువాత రమేష్ కి పరిశ్రమలో జితాన్ రమేష్ అని పేరు పెట్టారు. అతను నటుడు జీవాకు అన్నయ్య ..పాపులర్ నిర్మాత ఆర్.బి చౌదరి కుమారుడు అతడు. అయితే జీవా అంత స్మార్ట్ గా జితాన్ ఎదగలేదు.
2007 లో అమీర్ దర్శకత్వం వహించిన పరుతివీరన్ అనే తమిళ చిత్రంతో సూర్య సోదరుడు కార్తీ హీరోగా అడుగుపెట్టాడు. రొమాంటిక్ డ్రామాలో కార్తీ గ్రామస్తుడి పాత్ర పోషించాడు. అతను మాస్ రోల్ లో గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని బలమైన నటన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఒకటిగా నిలిచింది. దీనికి అనేక అవార్డులు కూడా వచ్చాయి. కార్తీని తొలి ప్రయత్నమే అతని సోదరుడు సూర్య సహా చాలామంది మెచ్చుకున్నారు.
ప్రభు సోలమన్ దర్శకత్వం వహించిన గుంకీ (2012) చిత్రంతో విక్రమ్ ప్రభు (హీరో ప్రభు వారసుడు) తొలిసారిగా అడుగుపెట్టాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ప్రభు సోలమన్ దర్శకత్వం ఆ సంవత్సరపు బ్లాక్ బస్టర్లలో ఒకటిగా మారింది. ఆ తర్వాత అతడు వరుసగా సినిమాల్లో నటించినా ఇటీవల కెరీర్ ఎందుకనో నెమ్మదించింది. అయినా ఓవర్ నైట్ లోనే ఏదీ జరగదు. మొదటి ప్రయత్నమే హిట్టు కొట్టి ఆదరణ పొందితే అతడిని ఓవర్ నైట్ స్టార్ అనేస్తారు. కానీ దానికి ముందు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి దర్శకనిర్మాతల కాళ్ల బేరమాడిన చాలామంది నటీనటులు ఫిలింనగర్ లో కోకొల్లలు.