Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: మ‌ళ్లీ స్టార్ల‌తో ఫామ్ హౌస్ లు కిట‌కిట‌

By:  Tupaki Desk   |   18 April 2021 5:00 AM IST
ట్రెండీ స్టోరి: మ‌ళ్లీ స్టార్ల‌తో ఫామ్ హౌస్ లు కిట‌కిట‌
X
ముంబై - హైద‌రాబాద్ స‌హా మెట్రో న‌గ‌రాల్లో ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్న సంగ‌తి తెలిసిందే. సెకండ్ వేవ్ అంద‌రినీ భ‌య‌పెడుతోంది. దీంతో సెల‌బ్రిటీలు ఫామ్ హౌస్ ల‌కే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. స‌ల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్.. షారూక్.. వీళ్లంతా ఇటీవ‌ల ఫామ్ హౌస్ ల‌లోనే గ‌డిపేస్తున్నారు. వీళ్లేనా..! ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోలంతా ఫామ్ హౌస్ లకు వెళ్లి అక్క‌డే కాల‌క్షేపం చేయ‌డం పంట‌లు పండించ‌డం అల‌వ‌ర్చుకుంటున్నారు. ప‌నిలో ప‌నిగా 2-3 గంట‌లు ఎండ‌లో శ్ర‌మించడం ద్వారా విట‌మిన్ -డిని పుష్క‌లంగా సంపాదిస్తున్నారు. ఇదో కొత్త ప‌రిణామం. క‌రోనా మొద‌టి వేవ్ లో ఇలా చేశారు. ఇప్పుడు రెండో వేవ్ లోనూ త‌ప్ప‌డం లేదు.

అయితే వీళ్లంద‌రి కంటే భిన్నంగా టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ లోని మామిడితోట‌లోనే చాలా కాలంగా ఇల్లు నిర్మించుకుని నివ‌శిస్తున్నారు. ఆయ‌నకు పంట‌లు పండించ‌డం తొలి నుంచి అల‌వాటు వ్యాప‌కం. ఇప్పుడు క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే ఆయ‌న ఫామ్ హౌస్ లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.

బాలీవుడ్ టాలీవుడ్ స్టార్లు చాలా మంది ఫామ్ ల‌కు వెళ్లేందుకే ఆస‌క్తిగా ఉన్నారు. బాలీవుడ్ క్లాసిక్ న‌టి నీనా గుప్తా- ముక్తేశ్వ‌ర్ లోని విడిది గృహంలో ఉన్నారు. మొద‌టి వేవ్ స‌మ‌యంలో క‌రోనాను న‌యం చేసుకునేందుకు ఈ విడిదిలోనే ఉన్న ఆమె తిరిగి సెకండ్ వేవ్ వ‌ల్ల అక్క‌డికే చేరుకున్నార‌ట‌. ముక్తేశ్వర్‌ నైనిటాల్ కు సమీపంగా ఉండే గొప్ప టూరిస్ట్ ప్లేస్ కావ‌డంతో ఎంతో ప్ర‌శాంతంగా ఉంటుంది.

బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ గ‌త ఏడాది అంతా ప‌న్వేల్ ఫామ్ హౌస్ లోనే గ‌డిపారు. ఇప్ప‌టికీ ఆయ‌న అక్క‌డే ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఇక అత‌డి గాళ్ ఫ్రెండ్స్ అంతా ఫామ్ హౌస్ కి వెళ్లి క‌లుస్తుండ‌డం చూసిన‌దే. ఆయ‌న‌తో క‌లిసి గుర్ర‌పు స్వారీలు చేస్తున్నారు. స‌ల్మాన్ ఇటీవ‌ల పంట‌లు పండించ‌డం నేర్చుకున్నారు.

అమీర్ ఖాన్ కి ఇటీవ‌లే క‌రోనా పాజిటివ్ అని తెలిసాక ఒక ఒంట‌రి గృహంలోకి వెళ్లార‌ని టాక్ వ‌చ్చింది. త‌న పంచంగి బంగ్లా ప‌రిస‌రాల్లోని ఫామ్ లో పంట‌లు పండిస్తూ గ‌త లాక్ డౌన్ లో అమీర్ బోలెడంత సంద‌డి చేశారు. బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టికి భారీగా ఔట‌ర్ లో ఫామ్ హౌస్ లు ఉన్నాయి. ఈ లాక్ డౌన్ సెల‌వుల్ని అక్క‌డే ఎంజాయ్ చేస్తున్నారు. త‌న భ‌ర్త పిల్ల‌ల‌తో క‌లిసి స్విమ్మింగ్ వ‌గైరా ఇక్క‌డే.

ఇక మెగాస్టార్ చిరంజీవి.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ల‌కు బెంగళూరు ప‌రిస‌రాల్లో భారీ ఫామ్ హౌస్ లు ఉన్నాయి. అక్క‌డికి వెళ్లేందుకు వారు నిరంత‌రం ప్రాధాన్య‌త‌నిస్తార‌న్న టాక్ ఉంది. ప్ర‌భాస్- ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఫామ్ హౌస్ ల‌లో అప్పుడ‌ప్పుడు పార్టీల‌కు వెళతార‌న్న టాక్ ఉంది. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ కి భారీగా ఫామ్ లు ఉన్నాయి. ఆయ‌న ప్ర‌స్తుతం వాట‌న్నిటినీ విజిట్ చేస్తున్నార‌న్న టాక్ ఉంది. ఈసారి క‌రోనా సెకండ్ వేవ్ తో ఈ ఫామ్ హౌస్ లు కిట‌కిట‌లాడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.