Begin typing your search above and press return to search.

రాశి ఖన్నా లేటెస్ట్ డైలాగ్ కిరాకో కిరాకు

By:  Tupaki Desk   |   10 Nov 2021 4:33 PM GMT
రాశి ఖన్నా లేటెస్ట్ డైలాగ్ కిరాకో కిరాకు
X
ఒక్కోసారి డైలాగ్ క‌నెక్ట‌యితే దానికి ఉండే మైలేజే వేరు. ఇంత‌కుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప‌లికిన త‌గ్గేదే లే! డైలాగ్.. మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్! లాంటి డైలాగ్ యూత్ లో ఎంతో వైర‌ల్ అయ్యాయి. పోకిరి- బిజినెస్ మేన్ డైలాగులు కానీ పూరి తీసే సినిమాల్లో కొన్ని పంచ్ లైన్లు కానీ యూత్ ని ఇట్టే ప‌ట్టేస్తాయి.

కానీ ఇప్పుడు రాశీ ఖ‌న్నా ప‌లికిన ఓ డైలాగ్ అంతే ఇదిగా యూత్ లో వైర‌ల్ అవుతోంది. ``ఇక్కడ ఈ ఎక్స్ ప్రెషన్ పెట్టకూడదు.. ఇలా పెట్టాలి`` ఇప్పుడు భారతదేశంలో టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న ట‌కా ట‌క్ స‌హా ఎన్నో యాప్ లలో ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ ఇది. ఆ ఒక్క డైలాగ్ ట్రెండింగ్ లో ఉందిప్పుడు. వీడియో షేరింగ్ వేదిక‌ల‌పై అందాల‌ రాశి ఖన్నా పాపులారిటీ అమాంతం పెరిగింది.

టిక్ టాక్ ని నిషేధించినా కానీ దానికి ప్ర‌త్యామ్నాయ యాప్ లు ఇటీవ‌ల బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంటోంది ఇలాంటి డైలాగ్ లతోనే. దీనికి యువ‌త‌రం న‌టీనటుల నుంచి సామాన్య జ‌నం నుంచి అనుక‌ర‌ణ‌లు ఓ రేంజులో ఉన్నాయి. `పక్కా కమర్షియల్` టీజర్ నుండి రాశి ఖ‌న్నా ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళ్లిపోతోంది. ఇక ఆ డైలాగ్ చెబుతూ రాశీ ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్ గుండెల్లో ముల్లు గుచ్చేస్తోంద‌నే చెప్పాలి. త‌నే ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి.. ``ఇక్కడ ఈ ఎక్స్ ప్రెషన్ పెట్టకూడదు`` అని చెప్పి ``ఇలా పెట్టాలి`` అంటూ చెప్పే విధానం గుండెల్ని గుల్ల చేస్తుంది. చీర‌క‌ట్టులో రాశీ అంద‌చందాల‌కు ఫిదా కానివాళ్లు ఉండ‌రు.

ఇక ఇదే టీజ‌ర్ లో గోపిచంద్ ఎంతో స్టైలిష్ యాక్ష‌న్ తో క‌ట్టిప‌డేశాడ‌నే చెప్పాలి. అయినా దానిని మ‌ర్చిపోయేంత‌గా రాశీ ఖ‌న్నా ఎక్స్ ప్రెష‌న్స్ డైలాగ్ గుర్తుండిపోయిందంటే అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి క‌నెక్ట‌యితే ఈ రేంజులోనే పేల్తుంది ఏదైనా! ఇంత‌కుముందు కూడా రాశీ ఖ‌న్నాను `ప్రతిరోజు పండగే` చిత్రంలో టిక్ టాక్ సుంద‌రిగా ఆవిష్క‌రించిన మారుతి ఇప్పుడు తిరిగి అలాంటి కామెడీ సెటప్ ని తెర‌పైకి తెచ్చార‌నే అనుకోవాలి. అస‌లు సినిమాలో రాశీ ఎలా ఉంటుందో చూడ‌క‌పోయినా కేవ‌లం ఒకే ఒక్క‌ డైలాగ్ వివిధ యాప్ లలో వైరల్ గా మారింది. యువ ఔత్సాహిక న‌టులు రాశీ పంచ్ డైలాగ్ ని స‌ద్వినియోగం చేస్తూ వ‌రుస‌గా వీడియోలను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. వీటిలో కొన్ని వీడియోలు రాశీఖ‌న్నాను మించి ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు. డైలాగ్ చెప్ప‌డ‌మే కాదు .. ఎక్స్ ప్రెష‌న్స్ లోనూ చించేస్తున్నారు. మొత్తానికి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ కి కావాల్సినంత ప్ర‌మోష‌న్ ని తెచ్చింది మాత్రం రాశీ డైలాగ్ అని చెప్పాలి. ఆ డైలాగ్ రాసిన ర‌చ‌యిత‌కు క్రెడిట్ ఇవ్వాలి. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంలో గోపిచంద్ .. రాశీ ఖ‌న్నా కూడా ఫుల్ ఎంట‌ర్ టైనింగ్ పాత్ర‌ల‌తో అల‌రించ‌నున్నారు.