Begin typing your search above and press return to search.
వారం గ్యాప్ లో రెండు బాలీవుడ్ సినిమాలతో ట్రీట్
By: Tupaki Desk | 8 Nov 2021 10:00 PM ISTకన్నడ బ్యూటీ రష్మిక మందన్న కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్..బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. హిందీలో మిషన్ మజ్ను..గుడ్ బై చిత్రాల్లో నటిస్తోంది. కాగా ఈ రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. మిషన్ మజ్నులో సిద్దార్థ్ మల్హోత్రాకి జంటగా నటిస్తోంది. రష్మికకి బాలీవుడ్ లో తొలి చిత్రమిది. శాంతను బాగ్చీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి.
దీంతో రష్మిక సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉంది. సమ్మర్ కానుకగా మే 13న రిలీజ్ అవుతోంది. మరో వైపు బాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలోనే లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ తో తెరపై పంచుకునే అవకాశం రెండవ సినిమా `గుడ్ బై` తో దక్కింది. వికాస్ బెహల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మిక చాలా కీలక పాత్ర పోషిస్తుంది. నటనకు ఆస్కారం ఉన్న ఫుల్ లెంగ్త్ పాత్రలో ఆకట్టుకోనుంది. సినిమా సక్సెస్ అయితే గనుక అమ్మడికి మంచి పేరొస్తుంది. కాగా ఈ సినిమా కూడా `మిషన్ మజ్ను`కి వారం గ్యాప్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే రష్మిక బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లే.
ఇక రష్మిక తెలుగు సినిమాల విషయానికి వస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప`లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. అలాగే కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఆడవాళ్లు మీకు జోహార్లు` అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. మరోవైపు కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి చర్చలు జరుపుతోంది. అన్నీ లైనప్ లోకి వస్తే టాలీవుడ్ లోనే రష్మిక కి సినిమాలు చేసే సమయం దొరకదు.