Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్: బిగ్ బాస్ నుంచి త‌మ‌న్నా ఔట్!

By:  Tupaki Desk   |   10 Aug 2019 3:01 PM GMT
ఎక్స్ క్లూజివ్: బిగ్ బాస్ నుంచి త‌మ‌న్నా ఔట్!
X
15 మంది హౌస్ మేట్స్ తో మొద‌లైన `బిగ్ బాస్` సీజ‌న్ 3 రోజు రోజుకు వేడి పెంచుతున్న‌ సంగ‌తి తెలిసిందే. అక్కినేని నాగార్జున హోస్టింగ్ తో బుల్లితెర వీక్ష‌కుల‌కు అదిరిపోయే ట్రీటిస్తోంది. ప్రేమ‌.. స్నేహం.. అనుబంధం.. కోప‌తాపాలు.. ఎమోష‌న్ ఇవ‌న్నీ అనుభూతి చెందుతున్నారు ఆడియెన్. వారం వారం ఎలిమినేష‌న్ వ‌ల్ల ఒక్కో స‌భ్యుడు లేదా స‌భ్యురాలు బ‌య‌ట‌కు వెళుతున్నారు. గ‌త‌వారం జర్న‌లిస్ట్ జాఫ‌ర్ ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లారు. ఈసారి ఎవ‌రి వంతు? అంటే `తుపాకి`కి తెలిసిన ఎక్స్ క్లూజివ్ సంగ‌తి ఇదీ. ఈసారి హౌస్ మేట్స్ నుంచి త‌మ‌న్నా ఔట్! అని తెలుస్తోంది.

ఇన్నిరోజులు హౌస్ లో అంద‌రి మ‌ధ్యా బోలెడంత సంద‌డి చేసిన త‌మ‌న్నా ఇక అక్క‌డ ఉండ‌డం కుద‌ర‌దు. ఊహించిన దానికంటే రూడ్ గా.. ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ గా ర‌గ్గ్ డ్ గా ప్ర‌వ‌ర్తించిన త‌మ‌న్నాను హౌస్ లో ఇత‌ర స‌భ్యులు వ్య‌తిరేకించారు. ప‌ప్పుగా ప‌ప్పుగా అంటూ ర‌విని తూల‌నాడిన త‌మ‌న్నా.. అలీపైనా సెటైర్లు వేయ‌డం ఎబ్బెట్టుగా అనిపించింది. అలా అమ్మాయిని ప‌క్క‌న పెట్టుకుని తైత‌క్క‌లాడ‌తావా? అంటూ అలీని త‌మ‌న్నా విమ‌ర్శించింది. ఆ ఎపిసోడ్స్ జుగుప్స పుట్టించాయ‌ని ఆడియెన్ అభిప్రాయ ప‌డ్డారు.

ఇక ఈ వేషాల‌న్నీ నేటితో క‌ట్ అని తెలుస్తోంది. నెగెటివ్ ఓటింగ్ వ‌ల్ల త‌మ‌న్నా బ‌య‌టికి వెళ్లే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ట‌. హౌస్ నుంచి బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే ఇది నిజ‌మా .. కాదా? అన్న‌ది క‌న్ఫామ్ గా రేపటికి గానీ తెలీదు. ఇదివ‌ర‌కూ హౌస్ నుంచి యాంక‌ర్ కం న‌టి శ్రీ‌ముఖి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది అని ప్ర‌చార‌మైంది. కానీ ఇంత‌లోనే త‌మ‌న్నా అంటూ ఇప్పుడు వినిపిస్తోంది. మ‌రి ఏది నిజం? అన్న‌ది తేలాల్సి ఉంది.