Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్ : ఆప‌రేష‌న్ బ‌ట‌ర్ ఫ్లై వెన‌కున్నది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   13 Dec 2022 10:24 AM GMT
ట్రైల‌ర్ టాక్ : ఆప‌రేష‌న్ బ‌ట‌ర్ ఫ్లై వెన‌కున్నది ఎవ‌రు?
X
రీసెంట్ గా నిఖిల్ తో క‌లిసి 'కార్తికేయ 2' మూవీతో పాన్ ఇండియా హిట్ ని సొంతం చేసుకుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. త్వ‌ర‌లో ఇదే హీరోతో క‌లిసి రొమాంటిక్ ల‌వ్ స్టోరీ '18 సేజెజ్'తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ వ్రైటింగ్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సుకుమార్ శిష్యుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డిసెంబ‌ర్ 23న ఈ సినిమాని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇదిలా వుంటే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తొలి సారి లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అను కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌లేటెస్ట్ స‌స్పెన్స్ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ 'బ‌ట‌ర్ ఫ్లై'. ఘంటా స‌తీష్ బాబు ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

భూమిక కీల‌క పాత్రలో న‌టిస్తోంది. ర‌వి ప్ర‌కాష్ బాబు బోడ‌పాటి, ప్ర‌సాద్ తిరువ‌ళ్లూరి, ప్రదీప్ న‌ల్లిమెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ నాలుగు భాష‌ల్లో ఈ మూవీని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా డిసెంబ‌ర్ 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. 'బ‌ట‌ర్ ఫ్లై' ర‌హ‌స్యం తెలుసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 29 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో థ్రిల్లింగ్ రైడ్ కోసం సిద్ధంగా వుండండి' అంటూ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రైల‌ర్ ని అభిమానుల‌తో పంచుకుంది.

పిల్ల‌ల కిడ్నాప్ నేప‌థ్యంలో సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్ స్టోరీ ఇది. కిడ్నాప‌ర్స్ అడిగినంత డ‌బ్బులు ఇచ్చినా కూడా పిల్ల‌ల‌ని ఎందుకు చంపేశారు..?.. సో మీ ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్ ఏంటీ? .. ఆప‌రేష‌న్ బ‌ట‌ర్ ఫ్లై వెన‌కున్న దెవ‌రు? .. అనుప‌మ కు సంబంధించిన చిన్నూ.. బ‌న్నూ.. ఎలా మిస్స‌య్యారు?.. వారిని ఎవ‌రు కిడ్నాప్ చేశారు?.. ఇంత‌కీ అనుప‌మ అక్క ఎవ‌రు?.. త‌నని వెంటాడుతున్న కిడ్నాప‌ర్స్ ఎవ‌రు? అనే ఆస‌క్తిక‌ర‌మైన అంశాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన మూవీ ఇది.

ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో గ్రిప్పింగ్ గా సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్ లా క‌నిపిస్తోంది. ఖ‌చ్చితంగా థ్రిల్ల‌ర్ సినిమాల‌ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకోవ‌డం ఖాయం. భూమిక‌, రావు ర‌మేష్ ఇందులో లాయ‌ర్ లుగా క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.