Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: తమిళ అర్జున్ రెడ్డి బాగున్నాడే!

By:  Tupaki Desk   |   22 Oct 2019 9:42 AM GMT
ట్రైలర్ టాక్: తమిళ అర్జున్ రెడ్డి బాగున్నాడే!
X
విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ను హీరోగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం 'అదిత్య వర్మ'. 'అర్జున్ రెడ్డి' కి రీమేక్ అయిన ఈ చిత్రానికి గిరీశాయ దర్శడు. మొదట ఈ సినిమాను 'వర్మ' పేరుతో బాలా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది.. భారీగా ట్రోలింగ్ జరిగింది. ఇక నిర్మాతలు కూడా 'అవుట్ పుట్ అనుకున్నట్టు రాలేదనే' ఉద్దేశంతో ఆ సినిమాను స్క్రాప్ చేసి కొత్తగా 'అర్జున్ రెడ్డి' సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేసిన గిరీశాయ కు బాధ్యతలు అప్పగించారు. 'ఆదిత్య వర్మ' టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది.

ట్రైలర్ ఎలా ఉంది అని మాట్లాడుకోబోయే ముందు ఒక చిన్న మాట ఏంటంటే.. కొన్ని సినిమాలకు క్లాసిక్ స్టేటస్ వస్తుంది. భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటి వాటిని రీమేక్ చేయడం సాహసం. అతి తక్కువ సందర్భాలలో మాత్రం ఒరిజినల్ ఫ్లేవర్ రీమేక్ లో కనిపిస్తుంది. అందుకే ఇలాంటి రీమేక్ సినిమాను ఒరిజినల్ తో పోల్చడం.. అంతకంటే బెటర్ అవుట్ పుట్ ఆశించడం సరికాదు. 'అర్జున్ రెడ్డి'ని హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' ను పోల్చి చూస్తే ఒరిజినల్ ను ఈక్వల్ చేయలేకపోయింది. అయితే హిందీ ఆడియన్స్ ను భారీగా మెప్పించింది.

విజయ్ దేవరకొండతో ధృవ్ ను పోల్చి చూడకుండా.. అర్జున్ రెడ్డి ట్రైలర్ తో ఈ ట్రైలర్ ను పోల్చకుండా ఒక ఫ్రెష్ మైండ్ సెట్ తో చూస్తే మాత్రం 'ఆదిత్య వర్మ' ట్రైలర్ తప్పనిసరిగా మెప్పిస్తుంది. నిజానికి బాలా దర్శకత్వంలో తెరకెక్కిన 'వర్మ' టీజర్ మరీ బీ గ్రేడ్ కాపీలా అనిపించింది. బాలా స్టైల్ వేరు.. ఆయన ఎంత అద్భుతమైన దర్శకుడు అయినా ఈ జెనరేషన్ ఫిలిం అయిన 'అర్జున్ రెడ్డి' సోల్ ను పట్టుకోలేకపోయాడని అనిపించింది.

ఈ సినిమా ఇంటెన్సిటీకి తగ్గట్టుగా ధృవ్ బాడీ లాంగ్వేజ్ ను చూపించగలగడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడనే ఫీల్ కలిగింది.. ట్రైలర్ ఎండ్ లో ధృవ్ తన చేతిలో బాటిల్ ను షేక్ చేసే సీన్ ఒక్కటి చాలు ఈ ధృవ్ ను కరెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు అని చెప్పడానికి. ఇక ట్రైలర్ లో లాస్ట్ వన్ మినిట్ సిడ్ శ్రీరాం పాడిన మెలోడీని బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేయడంతో ట్రైలర్ బాగుందనే ఫీల్ కలిగింది. ధృవ్ కు ఇది మంచి లాంచ్ ప్యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఆలస్యం ఎందుకు.. ఒకసారి చూసేయండి. తమిళం కదా అంటారా.. మన తెలుగు 'అర్జున్ రెడ్డి' ని ఇప్పటికి తమిళ ప్రేక్షకులు కొన్ని వందల సార్లు చూసి ఉంటారు.. వారికి లేని భాష ఇబ్బంది మనకెందుకు? పైగా సగం డైలాగ్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి!