Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : 'నగ్నం'గా ఊపేస్తున్న ఆర్జీవీ...!

By:  Tupaki Desk   |   9 Jun 2020 10:10 AM GMT
ట్రైలర్ టాక్ : నగ్నంగా ఊపేస్తున్న ఆర్జీవీ...!
X
'శివ' లాంటి చరిత్రలో నిలిచిపోయే సినిమాని ఇండస్ట్రీకి అందించిన స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అయితే ఇప్పుడు ఆర్జీవీ అలాంటి క్రియేటివ్ సినిమాలు తీయడం మానేసి బూతు సినిమాలతో.. 18 ప్లస్ వారు మాత్రమే చూసే 'ఏ' సర్టిఫికేట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా శృంగార తార మియా మాల్కోవాతో తెరకెక్కించిన ‘క్లైమాక్స్‌’ అనే చిత్రం ప్రేక్షకుల మీదకి వదిలాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను ఆన్ లైన్ వేదికగా రిలీజ్ చేశాడు. సినిమా ఎలా ఉన్నా 100 రూపాయలు టికెట్ రేట్ పెట్టి డబ్బులు మాత్రం బాగానే వసూలు చేసుకున్నాడు. ఈ సినిమాని దాదాపుగా మూడు లక్షల మంది ఆన్లైన్ లో చూశారట. అంటే మూడు కోట్ల రూపాయలు ఆర్జీవీ క్లైమాక్స్ కి వచ్చాయి. దీనితో లేట్ చేయకుండా ఆర్జీవీ మరోసారి ప్రేక్షకుల వీక్ నెస్ ని వాడుకోడానికి సిద్ధం అయ్యాడు.

ఇటీవలే 'నగ్నం' అనే చిన్న సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించిన వర్మ అప్పుడే ట్రైలర్‌ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. నేను రాజమౌళి ని కాదు.. ఇది 'RRR' కాదు ఇది 'NNN' అంటూ రిలీజ్ చేసాడు. బూతు కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ టీజర్ ఆ టైపు సినిమాలను కోరుకునే వారిని బాగానే ఆకర్షిస్తోంది. ‘క్లైమాక్స్’ కంటే మించి రెచ్చగొట్టేలా ఉన్న ఈ ‘నగ్నం’ టీజర్ చూస్తే ఇంత వరకు ఏ డైరక్టర్ కూడా లేడీస్ పై ఈ యాంగిల్ లో కెమెరా పెట్టలేదని చెప్పవచ్చు. ఆ సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయి మొహం కనిపించకుండా కేవలం ఆమె లోవర్ బాడీ పార్ట్స్ అయిన తొడల మీద కాళ్ళమీద ఫోకస్ పెట్టాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ.. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న హస్బెండ్ అనే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

'క్లైమాక్స్‌' సినిమాకు వంద రూపాయలు పెట్టిన వర్మ ఈసారి మాత్రం రెండు వందల రూపాయలను టికెట్ ధరగా నిర్ణయించాడు. ఆడవారిని నేను రెట్టింపు ఆరాధిస్తాను కాబట్టి రెట్టింపు ధర ఫిక్స్ చేశానని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ఈ 'NNN' కూడా 'క్లైమాక్స్' సినిమా మాదిరిగానే ఆర్జీవీ వరల్డ్ లో రిలీజ్ కాబోతోందని ప్రకటించారు. మరి ఈ చిన్న సినిమాని 200 రూపాయలు పెట్టి ఎంతమంది చూస్తారో చూడాలి.