Begin typing your search above and press return to search.

సాహో ట్రైలర్ లో ఏముంటాయి ?

By:  Tupaki Desk   |   8 Aug 2019 6:23 AM GMT
సాహో ట్రైలర్ లో ఏముంటాయి ?
X
సినిమా రిలీజ్ కు ఇంకా ఇరవై రోజులుకు పైగా టైం ఉంది కానీ ట్రైలర్ మాత్రం ఇంకో 48 గంటల్లో విడుదల కానుండటం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కునుకు రాకుండా చేస్తోంది. ఎల్లుండి 10న ముంబైలో ఆ మరుసటి రోజు 11న హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది యూనిట్. ఆన్ లైన్ లోకి శనివారమే వస్తుందా లేక తెలుగు వెర్షన్ లాంఛనం పూర్తయ్యాక ఒకేసారి పెడతారా అనే క్లారిటీ అయితే లేదు. కాకపోతే ట్రైలర్ లో ఏముందన్న దాని గురించి చిన్న చిన్న లీక్స్ వస్తున్నాయి.

దాని ప్రకారం సాహో ట్రైలర్ లో మనం ఊహించినట్టుగానే టెర్రిఫిక్ యాక్షన్ సీన్స్ తో పాటు ప్రభాస్ పాత్రలోని ఎంటర్ టైనింగ్ యాంగిల్ ని కూడా చూపించబోతున్నారట. హీరోయిన్ తో రొమాన్స్ ని లవ్ ని ఎక్కువ రివీల్ చేయకుండా ఈ రెండు అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ట్రైలర్ కట్ చేసినట్టుగా టాక్. అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు ఏదైతే సాహో ట్రైలర్ నుంచి ఆశిస్తున్నారో అది పూర్తిగా నెరవేరేలా దర్శకుడు సుజిత్ దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా వినికిడి.

అంచనాలు పెరగడం తగ్గడం పూర్తిగా ట్రైలర్ మీదే ఆధారపడి ఉంది కాబట్టి వాటికి అనుగుణంగానే ఎడిటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇంకో రెండు రోజులు యాంగ్జైటిని కంట్రోల్ చేసుకుంటే ఈ సందేహాలకు చెక్ పడిపోతుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్ పేరుతో కొన్ని యాప్స్ సాహో టికెట్లు అమ్మకానికి పెట్టేశాయి. బహుశా బాహుబలికి కూడా ఇంత ముందుగా బుకింగ్ చేసిన దాఖలాలు లేవు. సాహో ఈ రకంగానూ రికార్డుల వేట మొదలుపెట్టిందన్న మాట,