Begin typing your search above and press return to search.
సినీ పరిశ్రమలో విషాదం.. దిగ్గజ డైరెక్టర్ కన్నుమూత..!
By: Tupaki Desk | 19 April 2021 12:49 PM ISTభారతీయ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. మరాఠీ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకురాలిగా ఖ్యాతి పొందిన సుమిత్ర భవే (78) ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొన్ని రోజులుగా పుణెలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి మరింతగా విషమించి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
దర్శకురాలిగా మాత్రమే కాకుండా.. ప్రముఖ నిర్మాతగా కూడా మరాఠీ చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేశారు సుమిత్ర. దర్శకుడు సునీల్ సుక్తాంకర్ తో కలిసి పనిచేసిన ఆమె.. అద్భుతమైన చిత్రాలతో చిత్ర పరిశ్రమ రూపురేఖలనే మార్చేశారంటే అతిశయోక్తి కాదు.
వీరిద్దరూ కలిసి దాదాపు 17సినిమాలు తీశారు. 50కి పైగా షార్ట్ ఫిలిమ్స్ రూపొందించారు. నాలుగు టీవీ సీరియళ్లు కూడా తీశారు. చిత్రపరిశ్రమకు ఎంతగానో సేవలు చేసినందుకు గానూ.. ఎన్నో అవార్డులు వీరిని వరించారు. 2016లో ప్రతిష్టాత్మక గోల్డెన్ లోటస్ నేషనల్ అవార్డును అందుకున్నారు. 'కాసవ్' సినిమాకు ఈ పురస్కారం దక్కింది.
సుమిత్ర భవే మృతిపట్ల మరాఠీ చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.