Begin typing your search above and press return to search.

చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి

By:  Tupaki Desk   |   8 Feb 2022 11:40 AM IST
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి
X
యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన ‘మహాభారత్’ సీరియల్ లో భీముడి పాత్రను పోషించి ప్రేక్షకులను అలరించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి మృతిచెందారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన చనిపోయారు. ఢిల్లీలోని అశోక్ విహార్ లో ఉన్న ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

నిన్న రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య ఆయన మృతిచెందారు. చాలాకాలంగా ఆయన చాతి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఆయన చాలా ఇబ్బందికి గురికావడంతో డాక్టర్ ను ఇంటికి పిలిపించారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

ప్రవీణ్ కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు.. ఆయన గొప్ప అథ్లెట్ కూడా.. పలు ఈవెంట్లలో ఆయన హ్యామర్ థ్రో, డిస్కస్ త్రో విభాగాల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఏసియన్ గేమ్స్ లో ఆయన నాలుగు పథకాలు సాధించారు. 1966,1970 పోటీల్లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. 1966లో జరిగిన కామనవెల్త్ గేమ్స్ లో హ్యామర్ థ్రోలో సిల్వర్ మెడల్ సాధించారు. అథ్లెట్ గా ఎంతో సాధించిన ఆయన ఆ తర్వాత యాక్టర్ గా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

1988లో బీఆర్ చోప్రా నిర్మించిన ‘మహాభారత్’ సీరియల్ తో ప్రవీణ్ కుమార్ సోబ్తి కెరీర్ ను ప్రారంభించారు. ఆయన భార్య, కూతురు, ఇద్దరు తమ్ముళ్లు , ఒక సోదరి ఉన్నారు.