Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ బర్త్‌ డే వేడుకల్లో విషాదం.. ఒకరు మృతి నలుగురికి గాయాలు

By:  Tupaki Desk   |   23 Oct 2020 11:30 AM IST
ప్రభాస్‌ బర్త్‌ డే వేడుకల్లో విషాదం.. ఒకరు మృతి నలుగురికి గాయాలు
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోల బర్త్‌ డే వేడుకలను అభిమానులు వైభవంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. స్టార్‌ హీరోల బర్త్‌ డేలు అంటే చాలు పెద్ద ఎత్తున ప్లెక్సీలు కటౌట్‌ లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా స్టార్‌ హీరోల ప్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రభాస్‌ బర్త్‌ డే వేడుకలో భాగంగా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో కరెంటు తీగకు తగిలి ఒక వ్యక్తి మృతి చెందగా నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనూరులో జరిగింది. పూనూరు ఎస్సీ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రభాస్‌ అభిమాని అయిన వంకాయలపాటి సుగుణరావు అనే వ్యక్తి మృతి చెందడటంతో పాటు మరో నలుగురు అక్కడే ఉన్న వారు గాయాల పాలు అయ్యారు. గాయాలు అయిన వారిని వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైధ్యులు చెప్పారు. గాయ పడ్డ వారు బేతపూడి వాసు.. చింతల వాసు.. ఉసిరిపాటి అసిరి.. వంకాయలపాటి సుమంతలు ఉన్నారు. వీరి చికిత్స ప్రస్తుతం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ జిల్లా శాఖ నాయకులు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనపై ప్రభాస్‌ స్పందించే అవకాశం ఉంది. గతంలో పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్బంగా మెగా ఫ్యాన్స్ కూడా ఇలాగే ప్రమాదం బారిన పడి మృతి చెందారు. ఇలాంటి సంఘటనలు ప్రమాదాలు జరుగుతున్నా అభిమానులు జాగ్రత్తగా ఉండక పోవడం విచారకరం.