Begin typing your search above and press return to search.

బన్నీ కూడా హిట్ కొడితేనా!!

By:  Tupaki Desk   |   27 April 2018 12:15 AM IST
బన్నీ కూడా హిట్ కొడితేనా!!
X
కొన్న ఐటెమ్ బాగాలేకపోతే డబ్బు వాపస్ ఇవ్వబడును.. అని సమ్మర్ సెల్ అఫర్ పెట్టినట్లు సినిమా వాళ్లు కూడా అలాంటి అఫర్ పెట్టేస్తున్నారు. సినిమా ఏ మాత్రం నచ్చకపోయినా టికెట్ డబ్బులు తిరిగిచ్చేస్తామని చెబుతున్నారు. సాధారణంగా ఒక టికెట్ కొంటె మరొక టికెట్ ఫ్రీ అనే నిర్మాతలను చూశాం. కానీ ఆ విధంగా అఫర్ ఇచ్చిన నిర్మాత ఎవరనుకుంటున్నారా?. నా పేరు సూర్య సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లగడపాటి శ్రీధర్.

ఆయన ఏ కాన్ఫిడెన్స్ తో అన్నాడో గాని ఇప్పుడు ఆ డైలాగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ చాలా హిట్టేక్కింది. సంక్రాంతి ప్లాప్ అయినప్పటికీ రామ్ చరణ్ సమ్మర్ మొదట్లోనే టాలీవుడ్ కి బూస్ట్ ఇచ్చాడు. రంగస్థలం సినిమా చేసిన 100 కోట్ల బిజినెస్ కి తగ్గట్టుగా మహేష్ కూడా భరత్ అనే నేను సినిమాతో నాలుగు రాళ్లు ఎక్కువా సంపాదించి కంటిన్యూ చేసి నీరుపించాడు. ఇక అదే తరహాలో నా పేరు సూర్య సినిమాతో బన్నీ కూడా 100 కోట్లను ఈజీగా దాటేస్తాడని అంతా అనుకుంటున్నారు.

ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా చిత్ర నిర్మాత సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. మొదటి చిత్రమైన దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన విధానం సూపర్ అంటున్నారు. అభిమానులు కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేసుకున్నాడు. అల్లు అర్జున్ పర్ఫెమెన్స్ ఎలా ఉంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేస్తోన్న విషయం అందరికి తెలిసిందే.