Begin typing your search above and press return to search.

నారదుడి పాత్ర‌లో సంచ‌ల‌నాల `వైర‌స్` ఫేం?

By:  Tupaki Desk   |   13 March 2021 2:30 AM GMT
నారదుడి పాత్ర‌లో సంచ‌ల‌నాల `వైర‌స్` ఫేం?
X
నార‌దుడిని క‌ల‌హ‌భోజుడు అంటారు. క‌ల‌హాలు సృష్టించి లోక‌క‌ళ్యాణానికి పాటు పడేవాడిగా .. ముల్లోక సంచారిగా నార‌ద పాపుల‌ర్. నార‌దుడి వ‌ల్ల క‌ల‌త‌లు క‌ల్లోలాలు గొడ‌వ‌లు కామెడీ బోలెడంత పుడుతుంది. ఇప్పుడు అలాంటి వెర్స‌టైల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామ‌స్.

కేర‌ళ‌ను అట్టుడికించిన నిఫా వైర‌స్ ట్రాజెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన `వైర‌స్` చిత్రంతో అతడి పేరు మార్మోగింది. ఇటీవ‌ల క‌రోనా లాక్ డౌన్ లో ఎక్కువ‌మంది వీక్షించిన సినిమాగా వైర‌స్ కి గుర్తింపు ద‌క్క‌డం టోవినోకి బాగా క‌లిసొచ్చింది. ప్ర‌స్తుతం అత‌డు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో నార‌దన్ చిత్రం క్రేజీగా మారింది.

టోవినో థామస్ గత వారం నారదన్ - మిన్నాల్ మురళి షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల నారదన్ లో కీల‌క స‌న్నివేశాల్లో న‌టించాడు.
ఆశిక్ అబూ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ``నార‌ద‌న్ గా ముందెన్నడూ లేని పాత్రను పోషించాను. చాలా సరదాగా ఉండే పాత్ర ఇది`` అని టోవినో తెలిపాడు.

మిన్నాల్ మురళి విషయానికొస్తే.. ఈ చిత్రానికి బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సూపర్ హీరో చిత్రం అని ప్రచారం జ‌రుగుతోంది. ఈ రెండు చిత్రాలలో ఒక‌టి ఈ నెలలో విడుద‌కు సిద్ధ‌మ‌వుతోంది.