Begin typing your search above and press return to search.
బాలీవుడ్ పై దెబ్బేసిన తౌక్టే తుఫాన్..!
By: Tupaki Desk | 20 May 2021 12:07 PM ISTకరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ముందుగానే దాదాపుగా పెద్ద సినిమాల షూటింగ్స్ అన్నీ నిలిపివేశారు. కొన్ని సినిమాలు విదేశాలకు వెళ్లి చిత్రీకరణ జరుపుకుంటే.. మరికొన్ని చిత్రాలు ఇక్కడే కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుకున్నాయి. ఇన్నాళ్లూ షూటింగులపై పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో చిన్నా చితకా సినిమాల షూటింగ్స్ జరిపారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టడం.. దాన్ని నెల చివరి వరకూ పొడిగించడంతో సినిమా షూటింగులు అన్నీ ఆగిపోయాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం షూటింగులు ఆగలేదు. ప్రభుత్వం పెట్టిన నియమ నిబంధనలకు లోబడే అక్కడ షూటింగులు చేసుకుంటున్నారు.
అయితే ఇటీవల వచ్చిన తౌక్టే తుఫాన్ బాలీవుడ్ ని ముంచేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను బీభత్సం సృష్టించింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర - గుజరాత్ సహా పలు రాష్ట్రాలు గడగడలాడాయి. ఈ నేపథ్యంలో సెట్స్ మీద ఉన్న హిందీ సినిమాలన్నింటికి ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని సినిమాల షూటింగ్స్ భారీ సెట్స్ వేసి చిత్రీకరణ చేస్తున్నారు. అకాలంగా కురిసిన వర్షాల కారణంగా సెట్స్ నాశనం అయ్యాయి. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు పెండింగ్ ఉన్న 'టైగర్ 3' 'గంగుబాయి' వంటి సినిమాలకి సంబంధించిన సెట్స్ కూడా డ్యామేజ్ అయ్యాయని తెలుస్తోంది. అలానే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసుకోవాలని ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న సినిమాలకు కూడా తుఫాన్ కారణంగా బ్రేక్స్ పడ్డాయి. దీంతో ఈ సినిమా రిలీజులు ఇంకాస్త లేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.