Begin typing your search above and press return to search.

‘పుష్ప’ దేవి ఇజ్జత్ కా సవాల్‌!

By:  Tupaki Desk   |   26 July 2020 9:10 AM GMT
‘పుష్ప’ దేవి ఇజ్జత్ కా సవాల్‌!
X
ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు మరియు అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఇక ఈ రెండు చిత్రాల మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ కూడా పోటీ పడ్డాయి. అయితే ఆ పోటీలో అల వైకుంఠపురంలో చిత్రం పాటలు పై చేయి సాధించాయి. దేవిశ్రీ కాస్త వెనకబడ్డట్లుగా అనిపించింది. థమన్‌ ట్యూన్స్‌ ఇంకా కూడా మారు మ్రోగిపోతున్నాయి. ఈ సమయంలో అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా రూపొందుతున్న పుష్ప చిత్రాన్ని దేవి శ్రీ ప్రసాద్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కరోనా కారణంగా కావాల్సినంత టైం రావడంతో దేవిశ్రీ కుమ్మేశాడంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సుకుమార్‌ మరియు దేవిశ్రీల కాంబోకు సూపర్‌ హిట్‌ టాక్‌ ఉంది. అందుకే ఈ చిత్రం కూడా మ్యూజికల్‌ సూపర్‌ హిట్‌ గా నిలవడం ఖాయం అంటూ బన్నీ ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రం ఐటెం సాంగ్‌ గురించి అందుతున్న లీక్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సుకుమార్‌ సినిమాలో ఐటెం సాంగ్‌ కు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. సుకుమార్‌ ఎప్పుడు కూడా ఐటెం సాంగ్స్‌ ట్యూన్స్‌ ను అదరగొడతాడు. ఈసారి చాలా సమయం తీసుకుని మరింత దుమ్ము రేపే విధంగా ఐటెం ట్యూన్‌ ను చేశాడట. అద్బుతమైన ట్యూన్స్‌ మరియు అదరగొట్టే బన్నీ మాస్‌ స్టెప్పులతో పుష్ప ఐటెం సాంగ్‌ ఖచ్చితంగా అదిరిపోవడం ఖాయంగా మెగా ఫ్యాన్స్‌ ఆశగా ఎదురు చూస్తున్నారు.

కరోనా కారణంగా షూటింగ్‌ ఇంకా మొదలు కాకుండానే నిలిచి పోయిన పుష్పను త్వరలోనే మళ్లీ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు యాసలో అల్లు అర్జున్‌ మరియు రష్మిక మందన్నలు మాట్లాడబోతున్నారు. సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌ లుక్‌ సినిమాపై అంచనాలు పీక్స్‌ కు వెళ్లాయి.