Begin typing your search above and press return to search.

2020 సంక్రాంతికి ఠ‌ఫ్ ఫైట్‌

By:  Tupaki Desk   |   1 Jun 2019 2:30 PM GMT
2020 సంక్రాంతికి ఠ‌ఫ్ ఫైట్‌
X
2019 సంక్రాంతి బ‌రిలో ర‌జ‌నీకాంత్ - బాల‌కృష్ణ‌- రామ్ చ‌ర‌ణ్ - వెంకటేష్ -వ‌రుణ్ తేజ్ లాంటి హీరోలు పోటీప‌డ్డారు. ఈ పోటీలో `వెంకీ- వ‌రుణ్` జోడీ విజేత‌లుగా నిలిచి ఇత‌ర‌ హీరోల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. సైలెంట్ గా `ఎఫ్ 2-ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఇక 2020 సంక్రాంతి కి పోటీ ప‌డే పుంజులేవి? కాలం వేగంగా ప‌రిగెడుతోంది. స‌మ్మ‌ర్ దాటుకుని వ‌ర్షాకాలంలో అడుగుపెట్టేయ‌బోతున్నాం. 2019 ద్వితీయార్థంలో అడుగు పెట్ట‌డానికి ఇంకెంతో స‌మ‌యం లేదు కాబ‌ట్టి ఇప్ప‌టికే ప‌లువురు అండర్ ప్రొడ‌క్ష‌న్ ఉండ‌గానే సంక్రాంతి రిలీజ్ ల‌ను ఫిక్స్ చేసుకున్నారు. క్లీన్ గా సంక్రాంతి 2020 కి రిలీజ్ చేస్తున్నాం అంటూ అధికారికంగా పోస్ట‌ర్ల‌లోనూ వేసేస్తుండంతో ఒక్క‌సారిగా వేడి పెరిగింది.

నిన్న‌నే సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 26వ సినిమాకి `స‌రిలేరు నీకెవ్వ‌రు` అంటూ టైటిల్ ని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు.. టైటిల్ పోస్ట‌ర్లో ఎంతో స్ప‌ష్టంగా 2020 సంక్రాంతికి విడుద‌ల అంటూ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఎఫ్ 2 డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్- దిల్ రాజు సంయుక్త నిర్మాణంలో వ‌స్తున్న చిత్ర‌మిది. దీంతో ఇత‌ర స్టార్ హీరోలు త‌మ‌కు ధీటైన పోటీ త‌ప్ప‌ద‌నే అర్థ‌మైంది. ఆస‌క్తిక‌రంగా ఈసారి సంక్రాంతి రేసులో మాంచి ఉప్పు-కారం తిన్న పుంజులే దిగుతుండ‌డంతో పోటీ ర‌స‌కందాయంలో ప‌డింది.

మ‌హేష్ ఛ‌రిష్మాకి ఏమాత్రం త‌గ్గ‌ని ప్ర‌భాస్ కూడా బ‌రిలో ఉన్నాడు. అత‌డు న‌టిస్తున్న `జాన్` సంక్రాంతి బ‌రిలోనే రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది. ఇది పూర్తిగా రొమాంటిక్ ల‌వ్ స్టోరి కావ‌డంతో యూత్ లోనూ అంతే క్రేజు నెల‌కొంది. పైగా ఈ ఆగ‌స్టులో `సాహో` చిత్రంతో సెన్సేష‌న్స్ కి తెర‌తీస్తున్నాడు కాబ‌ట్టి జాన్ పైనా అంతే భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. అందుకే 2020 సంక్రాంతి బ‌రిలో ప్ర‌భాస్ పేరు ఫేవ‌రెట్ గా వినిపిస్తోంది. జిల్.రాధాకృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా యువి క్రియేష‌న్స్ - గోపి కృష్ణ మూవీస్ నిర్మిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ పందెంలో రేసు గుర్రం కూడా ఉంది. అల్లు అర్జున్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో రాధాకృష్ణ‌- అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం 2020 సంక్రాంతి బ‌రిలో ఉంది. బ‌న్ని కెరియ‌ర్ లో ఎంతో ప్ర‌తిష్ఠాత్మక చిత్ర‌మిది. త్రివిక్ర‌ముడు ష్యూర్ షాట్ హిట్ కొట్టాల‌ని పంతంతో తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. అలాగే కింగ్ నాగార్జున చాలా అడ్వాన్స్ డ్ గానే సంక్రాంతిపై క‌న్నేశార‌ని వార్త‌లొచ్చాయి. ద‌స‌రాకి అలాగే సంక్రాంతికి అక్కినేని కాంపౌండ్ సినిమాల్ని రిలీజ్ చేసేలా ఆయ‌న ప్ర‌ణాళిక‌లు తీర్చిదిద్దారు. మంచి రిలీజ్ తేదీ మంచి హిట్టుకి తావిస్తుంద‌న్న‌ది కింగ్ ప్లాన్. ఇక నాగార్జున హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించ‌నున్న బంగార్రాజు సంక్రాంతికి రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌న్మ‌ధుడు 2 చిత్రాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్న కింగ్ బంగార్రాజుపైనా తొంద‌ర్లోనే స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌నున్నారు. ఇక న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌- కె.ఎస్.ర‌వికుమార్ ప్రాజెక్టు సెట్స్ కెళ్ల‌డం కొంత ఆల‌స్య‌మైనా సంక్రాంతి రేసులోనే రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ ఉంద‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. ఇక వీళ్ల‌తో పాటు ఇప్పుడున్న న‌వ‌త‌రం హీరోల్లో నాని- శ‌ర్వానంద్- నాగ‌చైత‌న్య‌- అఖిల్ లాంటి హీరోల సినిమాలు కూడా సంక్రాంతి బ‌రిలో రిలీజ‌య్యేందుకు ఆస్కారం లేక‌పోలేదని తెలుస్తోంది.