Begin typing your search above and press return to search.

టచ్ చేసి చూస్తే ఓవర్సీస్ లో డల్

By:  Tupaki Desk   |   1 Feb 2018 4:23 PM IST
టచ్ చేసి చూస్తే ఓవర్సీస్ లో డల్
X
అసలు మొన్నటివరకు సినిమా ఎప్పుడొస్తుందో తెలియదు కాని.. సడన్ గా రిపబ్లిక్ డే నాడు ఒక టీజర్ తో వచ్చేసిన మాస్ రాజా.. ఇప్పుడు ఏకంగా ఫిబ్రవరి 2న సినిమా రిలీజ్ అనేశాడు. ఈలోపు కొన్ని నామమాత్రపు ఇంటర్యూలతో ప్రమోషన్లు అంటూ ఒకవైపు రవితేజ మరోవైపు రాశి ఖన్నా కాస్త హడావుడి చేశారు. ఒక్కో ఛానల్ కు ఒక్కోరోజు వెళ్లి ప్రమోట్ చేస్తేనే ఇక్కడ జనాల్లోకి సినిమాలు సరిగ్గా వెళ్ళని రోజుల్లో.. మనోళ్లు అందరికీ కలిపేసి ఒక ఇంటర్యూ ఇచ్చేసి.. టచ్ చేసి చూస్కోండి అంటున్నారు.

తెలుగు రాష్ట్రల్లో ఇలాంటి అరకొర ప్రమోషన్లతో కూడా బండి లాగించేయవచ్చు. ఎందుకంటే మాస్ సెంటర్లలో రాశి ఖన్నా గ్లామర్.. సీరత్ కపూర్ హాట్నెస్ లను కలగలపి వేసే పోస్టర్లను చూసి జనాలు ధియేటర్లలోకి పరిగెత్తే ఛాన్సుంది. కాని ఓవర్సీస్ లో అలా జరగదు. అసలు ఇప్పుడు అత్యధిక వసూళ్లను రాబట్టాలంటే.. ఓవర్సీస్ 1 మిలియన్ డాలర్ రేంజు కలను సాకారం చేసుకోవాలి. ఇక్కడ చూస్తుంటే మాత్రం.. అసలు అమెరికా వంటి దేశాల్లో ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతుందనే చాలామందికి తెలిసినట్లు లేదు. పైగా ట్రైలర్ అంతా రొటీన్ గా ఉండటం.. పైపెచ్చు సినిమాను అమెరికాలో అస్సలు ప్రమోట్ చేయకపోవడంతో.. ఈ సినిమా మీద ప్రొడ్యూసర్లకు పంపిణీదారులకే నమ్మకం లేదా అనే సిగ్నల్ ఎన్నారై ఆడియన్స్ లోకి వెళిపోతోంది. ఇదంతా సినిమాకు మైనస్సే మరి.

అజ్ఞాతవాసి తరువాత ఓవర్సీస్ మార్కెట్ కూడా బాగా డల్ అయ్యింది. ఆ సమయంలో భాగమతి కాస్త ఇంప్రెస్ చేసింది. అక్కడ సినిమాల దృష్ట్యా ఉన్న లోటును వాడుకోవాలే కాని.. ప్రమోషన్లను సరిగ్గా చేసుకోకపోతే టచ్ చేసి చూడు అని చెప్పగానే ప్రేక్షకులు ఎలా టచ్ చేసి చూస్తారు చెప్మా? అసలే కొత్త డైరక్టర్ తీసిన సినిమా కాబట్టి.. కాస్త హడావుడి కూడా గట్టిగా చేయాలి గురూ!!