Begin typing your search above and press return to search.

'అవ‌తార్-2' ప్ర‌చారం కోసం టోట‌ల్ ఫ్యామిలీ!

By:  Tupaki Desk   |   25 Dec 2021 1:30 AM GMT
అవ‌తార్-2 ప్ర‌చారం కోసం టోట‌ల్ ఫ్యామిలీ!
X
జేమ్స్ కామెరూన్ విజువ‌ల్ వండ‌ర్ `అవ‌తార్-2` రిలీజ్ కోసం వ‌ర‌ల్డ్ వైడ్ అభిమానులు ఎంత ఎగ్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. `అవ‌తార్` పండోరా గ్ర‌హాన్ని 3డిలో మ‌ళ్లీ వీక్షించాల‌న్న తాప‌త్ర‌యం ప్ర‌జ‌ల్లో ఉంది. అవ‌తార్ ని పండోరాని సృష్టించిన కామెరూన్ `అవ‌తార్-2` తో మ‌రో కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్ల‌బోతున్నారు. ఈసారి కాన్సెప్ట్ కంటెంట్ పూర్తిగా డిఫరెంట్ గా ప్లాన్ చేయ‌డంతో ఇది పార్ట్ 1 ని మించి సంచ‌ల‌నంగా మార‌నుంది.

అండ‌ర్ వాట‌ర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఆద్యంతం ఉత్కంఠ క‌లిగించే మ‌లుపుల‌తో ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని లీకులు అందాయి. `అవ‌తార్` ని మించి `అవ‌తార్ -2` ఉండ‌బోతుంద‌న్న అంచ‌నాలు భారీ ఎత్తున ఉన్నాయి. 16 డిసెంబ‌ర్ 2022 న‌ `అవ‌తార్ -2`ని రిలీజ్ చేస్తున్నారు. అంటే వ‌చ్చే ఏడాదంతా యూనిట్ సినిమాని ప్ర‌మోట్ చేసే ప‌నిలోనే ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌లే `అవ‌తార్` క‌పుల్స్ జేక్ స‌ల్లీ-నేతిరి ఫ్యామిలీని నిర్మాత‌లు ప‌రిచ‌యం చేసారు. న‌లుగురు పిల్ల‌లు క‌లిగిన జంట‌గా అవ‌తార్ ఫ్యామిలీ తెర‌పై క‌నిపించ‌నుంది. అందులో ఓ కుర్రాడిని స్పైడ‌ర్ త‌ర‌హాలో ప‌రిచ‌యం చేసారు. అంటే `అవ‌తార్ -2`లో క‌పుల్స్ పాత్ర‌ల‌తో పాటు వాళ్ల‌కి సంబంధించిన పిల్ల‌లు.. బంధువుల పాత్ర‌ల్ని సైతం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దార‌ని తెలుస్తోంది. అండ‌ర్ వాట‌ర్ ఈ ఫ్యామిలీ ప్ర‌త్య‌ర్ధుల‌తో చేసే పోరాటాలు హైలైట్ గా ఉంటాయ‌ని ఊహించొచ్చు. ఇప్ప‌టికే `అవ‌తార్-2`..`అవ‌తార్ -3` భాగాల‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఇంకా మ‌రో రెండు భాగాలుగా `అవ‌తార్4-5 భాగాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

ఇక ఒక్కో భాగానికి 1900 కోట్ల బ‌డ్జెట్ కేటాయించి తెర‌కెక్కిస్తున్నారు. అంటే మొత్తం నాలుగు `అవ‌తార్` ప్రాంచైజీల‌కు క‌లిపి ప్ర‌చారం స‌హా 11300 కోట్లు ఖ‌ర్చు అవుతుందట‌. అవ‌తార్ ప్రాంచైజీ నుంచి వ‌చ్చే సినిమాల‌న్ని రెండేళ్ల గ్యాప్ లో ఒక్కొక్క‌టిగా రిలీజ్ అవుతాయి. వాస్త‌వానికి అవ‌తార్-2 ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి. కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు 2022లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఆ త‌ర్వాత 2024లో ఒక‌టి..2026లో మ‌రొకటి..2028 లో చివ‌రిది రిలీజ్ అవుతాయి. `అవ‌తార్` తొలి భాగం 2009 లో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. 20 వేల కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లోనే ఓ రికార్డును నెల‌కొల్పింది. అవ‌తార్ ఇప్ప‌టికీ నంబ‌ర్ -వ‌న్ చిత్రంగా రికార్డుల‌కెక్కింది. అవెంజ‌ర్స్ సైతం ఈ రికార్డును స‌వ‌రించ‌లేదు. అవ‌తార్ రీరిలీజ్ ల వ‌సూళ్ల‌తో ఇప్ప‌టికీ నంబ‌ర్ వ‌న్ గా నిలిచింది.