Begin typing your search above and press return to search.
ఆ బ్యూటీ ఫేడ్ అవుట్ అయింది ఆ నాటీ డైరెక్టర్ వల్లేనా?
By: Tupaki Desk | 1 May 2020 11:32 AM ISTఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తీసుకుంటుందో తెలియదు. అలాగే ఏ హీరోయిన్ కెరీర్ ఎప్పుడు ఎలా మలుపు తీసుకుంటుందో తెలియదు. అన్నీ కలిసి వస్తేనే ఏ హీరోయిన్ అయినా స్టార్ గా మారుతుంది. లేకపోతే ఇన్స్టా పోస్టులకే పరిమతమై కామెంట్లు చదువుతూ లైకులు లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఓ టాలీవుడ్ హీరోయిన్ పరిస్థితి అలానే ఉందట.
ఆ హీరోయిన్ ఓ మంచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మేకప్ లేకపోయినా బుట్టబొమ్మ లాగా అందంగా ఉంటుంది. పీరియడ్ బ్యాక్ డ్రాప్.. ట్రెడిషనల్ గెటప్ ఉన్న పాత్ర కావడంతో చాలామందికి కనెక్ట్ అయింది.. మంచే పేరే తెచ్చుకుంది. తొలి సినిమా తర్వాత ఓ అర డజను సినిమాల్లో నటించినా అవేమీ హిట్లు కాలేదు. తనకు మొదటి సినిమాతో వచ్చిన ఆ హోమ్లీ ఇమేజ్ ను వదిలించుకోవాలని ప్రయత్నించినా అది కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఏకంగా ఫేడౌట్ అయింది. ఇలా ఫేడ్ అవుట్ కావడానికి కారణం చాలామంది ఫ్లాపు సినిమాలు అనుకుంటున్నారు కానీ అది నిజం కాదట. మొదటి సినిమా డైరెక్టర్ తో మాంఛి ఫ్రెండ్షిప్ చేసిందట. 'స్నేహితుడా ఓ స్నేహితుడా రహస్య స్నేహితుడా' అని పాటలు కూడా పాడిందేమో కానీ ఆ డైరెక్టర్ పై చాలా నమ్మకం పెట్టుకుందట. ఆయన చెయ్యబోయే సినిమాల్లో తనను హీరోయిన్ గా తీసుకుంటాడనే ఉద్దేశంతో తనకు వచ్చిన కొన్ని క్రేజీ ఆఫర్లను వదిలేసుకుందట.
కట్ చేస్తే ఒక జీవిత కథ పుణ్యమా అని ఈయన కెరీర్ కథ అటూ ఇటూ అయింది. ఈయనకు సినిమాలు చేతిలో లేక పోవడంతో ఆ హీరోయిన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టాక్ వినిపిస్తోంది. ఆ డైరెక్టర్ తో ఉన్న సీక్రెట్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఈమె కెరీర్ కు ఎసరొచ్చేలా చేసిందని.. లేకపోతే తన చేతిలో ఇప్పటికీ సినిమాలు ఉండేవని అంటున్నారు. మరి ఇన్ని మలుపులు తీసుకున్న ఈ హీరోయిన్ కెరీర్ కరోనా క్రైసిస్ తర్వాత మరేదైనా పాజిటివ్ మలుపు తీసుకుంటుందేమో వేచి చూడాలి.