Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: కెరీర్ ఒత్తిడితో లైఫ్ లో కొన్ని డిలే

By:  Tupaki Desk   |   15 Dec 2022 7:30 AM GMT
టాప్ స్టోరి: కెరీర్ ఒత్తిడితో లైఫ్ లో కొన్ని డిలే
X
యుక్త‌వ‌య‌సులో ప్రేమ పెళ్లి ఉద్యోగం గ‌మ్యం వైపు ప్ర‌యాణం ఇవ‌న్నీ ప్ర‌తిఒక్క‌రికీ అనుభ‌వ పాఠాలుగా మిగులుతాయి. అయితే లైఫ్ అంద‌రికీ పాకెట్ లో ప‌ర్సు లాంటిది కాదు. అంత సులువుగా ఏదీ చిక్క‌దు. ఆశించిన దానికి భిన్నంగా కొన్ని జ‌రుగుతుంటాయి. దీనినే విధి అంటారు! దీనికి సామాన్యుడు అయినా సెల‌బ్రిటీ అయినా ఒక‌టే.

ముఖ్యంగా సినీరంగంలో గొప్ప స్టార్లుగా వెలిగినా కొంద‌రికి కొన్ని అంత తేలిగ్గా చిక్కిన‌వి కావు అనేది గ్ర‌హించాలి. ముఖ్యంగా తెలుగు చిత్ర‌సీమ‌లో కెరీర్ కోసం పాకులాడి కొన్నిటిని ఆల‌స్యంగా పొందిన వారి జాబితాలో కొంద‌రు స్టార్ల పేర్లున్నాయి. ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి న‌ట‌వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ .. డార్లింగ్ ప్ర‌భాస్ గురించి అభిమానులు త‌ర‌చుగా ముచ్చ‌టించుకున్న సంద‌ర్భాలున్నాయి. ఆ ఇద్ద‌రూ స‌మ‌కాలీన ప్ర‌పంచంలో గొప్ప స్టార్లుగా వెలిగిపోతున్నారు. కానీ కెరీర్ కోసం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తే కానీ ఇప్ప‌టి స్టార్ డమ్ చిక్క‌లేదు. కెరీర్ ఆరంభం మెగాస్టార్ వార‌సుడిగా తెరంగేట్రం చేసిన రామ్ చ‌ర‌ణ్ పై తీవ్ర‌మైన ఒత్తిడి ప‌ని చేసేద‌ని చెబుతారు. అత‌డు తండ్రిని మించిన త‌న‌యుడిగా నిరూపించేందుకు అతి పెద్ద‌ స‌వాల్ ని స్వీక‌రించాడు. కెరీర్ ఆరంభం ప్ర‌యోగాల జోలికి వెళ్ల‌కుండా హిట్టు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో న‌టించేందుకే మొగ్గు చూపాడు. దీనికోసం చాలా శ్ర‌మించినా ఆరంభం ఆశించినంత పెద్ద విజ‌యాలేవీ ద‌క్క‌లేదు. కొన్ని విమ‌ర్శ‌ల‌ను కూడా ఎదుర్కొన్నాడు.

అదే క్ర‌మంలో టాలీవుడ్ లో బ్యాంక‌బుల్ స్టార్ గా ఎదిగేందుకు.. అసాధార‌ణ‌ స్టార్ డ‌మ్ ని పెంచుకునేందుకు చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. మ‌గ‌ధీర లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఆరంభ‌మే అందుకున్నా కానీ ఆ త‌ర్వాతా చాలా కాలం చ‌ర‌ణ్ స‌రైన సంతృప్తినిచ్చే విజ‌యం కోసం ద‌శాబ్ధం పాటు ఎదురు చూడాల్సి వ‌చ్చిందంటే అర్థం చేసుకోవాలి. కాంపిటీష‌న్ అధికంగా ఉన్న‌ టాలీవుడ్ లో స్టారాధి స్టార్ వార‌సుడిగా చ‌ర‌ణ్ పైనా తీవ్ర ఒత్తిడి ఎప్పుడూ ప‌ని చేసిందని విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. వ‌న్ ఫైన్ డే త‌న స్నేహితురాలు ఉపాస‌న కొణిదెల‌ను చ‌ర‌ణ్‌ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట స్నేహం లైఫ్ స్టైల్ పై నిరంత‌రం అభిమానుల ఫోక‌స్ ఉండేది. కిడ్స్ ప్లానింగ్ పై ప్ర‌తిసారీ ప్ర‌శ్న‌లు ఎదురయ్యేవి. ప్ర‌తిసారీ ఉపాస‌న త‌మ కెరీర్ ని బెట‌ర్ గా చ‌క్క‌దిద్దుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని మీడియా చాటింగుల్లో వెల్ల‌డించేవారు. ఎట్ట‌కేల‌కు ప‌దేళ్ల‌కు ఈ జంట త‌మ జీవితంలోకి ఒక కొత్త అతిథిని ఆహ్వానిస్తుండ‌గా ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆనందంగా త‌న అభిమానుల‌కు సోష‌ల్ మీడియాల ద్వారా వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్- ఉపాస‌న జంట మామ్ డాడ్ కాబోతున్నార‌నే శుభ‌వార్త చెప్పేందుకు కొన్నేళ్ల పాటు వేచి చూడ‌క త‌ప్ప‌లేదు.

ఇక డార్లింగ్ ప్ర‌భాస్ స్టోరి వేరు. ప్ర‌భాస్ 40 ప్ల‌స్ ఏజ్ లోను ఇంకా పెళ్లికి సిద్ధం కాక‌పోవ‌డం వెన‌క కార‌ణం అత‌డు స్టార్ డ‌మ్ ని అందిపుచ్చుకునేందుకు ప‌డ్డ శ్ర‌మ ఒక కార‌ణం అయితే.. ఇటీవ‌లి కాలంలో పాన్ ఇండియా స్టార్ గా ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడి కూడా ఈ ఆల‌స్యానికి మ‌రో కార‌ణం అన్న గుస‌గుసా వినిపిస్తోంది. ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాకి వంద కోట్లు వ‌సూలు చేస్తుండ‌డంతో దానికి త‌గ్గ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడ‌న్న టాక్ ఉంది. ఇక డార్లింగ్ ప్ర‌భాస్ పెళ్లి చేయాల‌న్న కోరిక నెర‌వేర‌కుండానే రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు అంత‌ర్ధానం అయ్యారు. ఇక‌పై అయినా కెరీర్ ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డి ప్ర‌భాస్ నుంచి శుభవార్త వ‌స్తుంద‌నే అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కేవ‌లం చ‌ర‌ణ్‌- ఉపాస‌న జంట గురించే కాదు.. అటు బాలీవుడ్ లో బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ నుండి అమీర్ ఖాన్- కిరణ్ రావు వ‌ర‌కూ పెళ్లయిన కొన్ని సంవత్సరాల తర్వాత పేరెంట్ హుడ్ ని స్వీకరించాలని నిర్ణయించుకున్నట్టు క‌థ‌నాలొచ్చాయి. బాలీవుడ్ మంకీ క‌పుల్ గా పేరున్న బిపాషా బసు - కరణ్ సింగ్ గ్రోవర్ 2016లో పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 2022లో కుమార్తె దేవికి తల్లిదండ్రులు అయ్యారు. ఇద్దరూ తమ సోషల్ మీడియాలో తమ బిడ్డ రాకను ప్రకటించారు. ఈ అన్యోన్య‌ జంట ఆరేళ్ల పాటు త‌మ తొలి సంతానం కోసం వేచి చూడాల్సి వ‌చ్చింది. ఇక బిపాసా- క‌ర‌ణ్ జంట టీవీ- ఫిలిం ఇండ‌స్ట్రీలో నిర్మాణ రంగంపై భారీగా పెట్టుబ‌డులు పెట్టి స‌క్సెస్ కోసం ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. అదే క్ర‌మంలో ఆర్థిక ప‌ర‌మైన ఒత్తిడుల‌ను ఎదుర్కొన్నారు.

యువరాజ్ సింగ్ - హాజెల్ కీచ్ జంట స‌న్నివేశం ఇందుకు భిన్నం కాదు.
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ బాలీవుడ్ క‌థానాయిక‌ హాజెల్ కీచ్ ని పెళ్లాడాక చాలా కాలం పాటు కిడ్స్ రాక కోసం వేచి చూసారు. చివ‌రికి మగబిడ్డ ఓరియన్ కు తల్లిదండ్రులయ్యారు. 2016లో పెళ్లితో ఒక‌టైన‌ ఈ జంట‌ 2022లో వార‌సుడిని స్వాగతించారు. హ్యాపీ క‌పుల్ తమ కుమారుడిని స్వాగతించే క్ర‌మంలో సోషల్ మీడియాలో ఉమ్మడి ప్రకటనను షేర్ చేసారు.

బాలీవుడ్ అందాల‌ నటి అమృతా రావు త‌న‌ భర్త RJ అన్మోల్ తో వివాహం అనంత‌రం పిల్ల‌ల కోసం ఆరేళ్ల వ‌ర‌కూ వేచి ఉండాల్సి వ‌చ్చింది. ఈ ఇద్ద‌రూ కెరీర్ విష‌యంలో చాలా ప్ర‌యోగాలు చేసారు. ఒత్తిడిని ఎదుర్కొన్నామ‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు. పెళ్ల‌యిన చాలా కాలానికి తల్లిదండ్రులు అయ్యారు. ఇద్దరూ నవంబర్ 2020లో తమ కొడుకు వీర్ రాకను ప్రకటించారు.

బాలీవుడ్ జంట అమీర్ ఖాన్ .. త‌న స‌హ‌చ‌రి కిరణ్ రావ్ ని 2005లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సరోగసీని ప్రయత్నించే ముందు చాలా సంవత్సరాలు కిడ్స్ కోసం వేచి ఉన్నారు. 2011లో వారి కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్ ను స్వాగతించారు. సన్నీ లియోన్- డేనియల్ వెబర్ 2011లో ఒక‌ట‌య్యారు. 2017లో దత్తత తీసుకున్న పాప నిషాకు తల్లితండ్రులయ్యేందుకు ఈ జంట‌ ఆరేళ్ల పాటు ఎదురుచూసింది. 2018లో సరోగసీ ద్వారా కిడ్ జన్మించారు. కెరీర్ జ‌ర్నీలో ఒత్తిళ్లు లేదా ల‌క్ ఫేవ‌ర్ గా లేక‌పోవ‌డం కూడా కొన్ని ఆల‌స్యాల‌కు కార‌ణ‌మ‌ని సంబంధిత‌ శాస్త్రాలు చ‌దివిన‌ పండితులు విశ్లేషిస్తుంటారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.