Begin typing your search above and press return to search.

టాప్ స్టోరీ: దూసుకొస్తున్న హిస్టారిక‌ల్ వారియ‌ర్స్

By:  Tupaki Desk   |   22 Nov 2019 4:45 AM GMT
టాప్ స్టోరీ: దూసుకొస్తున్న హిస్టారిక‌ల్ వారియ‌ర్స్
X
దేశీయ సినీ మార్కెట్ కు రాజ‌మౌళి రూపొందించిన 'బాహుబ‌లి' ఇచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు. చారిత్రాత్మ‌క చిత్రాల్ని నిర్మించాలంటే ఒక‌ప్పుడు ఎన్నో సందేహాలు ఉండేవి. జ‌నాద‌ర‌ణ ఉంటుందా? వ‌ంద‌ల‌ కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ పెట్టాక తిరిగి వెన‌క్కి వ‌స్తుందా? అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అని మేక‌ర్స్ భ‌య‌ప‌డేవారు. కానీ 'బాహుబ‌లి' త‌రువాత ఒక్క‌సారిగా భార‌తీయ సినీ మార్కెట్ స్థాయి మారిపోయింది. ఈ కొత్త ప‌రిణామం అనంత‌రం ఔత్సాహిక‌ ఫిలిం మేకర్స్ ఎంతో కాలంగా చారిత్రాత్మ‌క చిత్రాల్ని నిర్మించాల‌నుకున్న వాళ్లంతా ఒక్క‌సారిగా ధైర్యే సాహ‌సి అన్న తీరుగా భారీ పాన్ ఇండియా చిత్రాల నిర్మాణం మొద‌లుపెట్టారు.

టాలీవుడ్ స‌హా అన్నిచోట్లా ఈ త‌ర‌హా చిత్రాల మేకింగ్ ప్ర‌స్తుతం ఊపందుకుంది. గ‌తంలో వీర్‌- అశోక వంటి చిత్రాలు నిర్మించినా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోవ‌డంతో బాలీవుడ్ మేక‌ర్స్ చారిత్రాత్మ‌క చిత్రాల్ని నిర్మించ‌డానికి సాహ‌సించ‌లేదు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ధైర్యం చేయ‌డం.. భాజీరావ్ మ‌స్తానీ లాంటి క‌ళాత్మ‌క చిత్రాన్ని తీసి స‌క్సెస్ చేయ‌డం.. అనంత‌ర కాలంలో 'బాహుబ‌లి' విజ‌యం సాధించిన క్ర‌మంలో ప‌ద్మావ‌త్ 3డి లాంటి భారీ సాహ‌సం చేయ‌డం అది స‌క్సెస‌వ్వ‌డం ఒక గొప్ప ప‌రిణామం. ఇక‌పై భారీ కాన్వాసుతో పాన్ ఇండియా కేట‌గిరీలో భారీ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న‌ల్ చిత్రాల‌కు మార్గాన్ని సుగ‌మం చేయ‌డం సాధ్య‌మ‌వుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ మేక‌ర్స్ చారిత్రాత్మ‌క చిత్రాల్ని నిర్మించ‌డానికి ముందుకు రావ‌డం కొత్త ఊపు తెస్తోంది. పాన్ ఇండియా జాబితాలో వ‌చ్చిన చిత్రాలు ప‌ద్మావ‌త్‌- కేస‌రి- మ‌ణిక‌ర్ణిక కొత్త ఉత్సాహం నింపాయి.

మ‌ధ్య‌లో 'క‌ళాంక్‌' సినిమా దారుణంగా వైఫ‌ల్యం చెందినా చారిత్రాత్మ‌క చిత్రాల నిర్మాణం మాత్రం త‌గ్గ‌లేదు. తాజాగా రెండు వారియ‌ర్ చిత్రాలు బాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. 'లాగ‌న్‌' ఫేమ్ అశుతోష్ గోవారిక‌ర్ రూపొందిస్తున్న 'పానిప‌ట్‌'. అజ‌య్ దేవ‌గ‌న్ న‌టిస్తున్న 'తానాజీ' త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్నాయి. పానిప‌ట్ యుద్ధం నేప‌థ్యంలో 'పానిప‌ట్‌'.. మ‌రాఠా యోధుడు తానాజీ వీర గాథ నేప‌థ్యంలో 'తానాజీ' చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ రెండు చిత్రాల మ‌ధ్య భారీ పోటీ నెల‌కొనే అవ‌కాశం వుంది. 'పానిప‌ట్‌' డిసెంబ‌ర్ 6న రిలీజ్ కాబోతుండ‌గా 'తానాజీ' జ‌న‌వ‌రి 10న రిలీజ్ కాబోతోంది. ఈ రెండు చిత్రాల త‌రువాత మ‌రి కొన్ని కూడా త్వ‌ర‌లో సెట్స్ పైకి రాబోతున్నాయి. అందులో సంజ‌య్ లీలా భ‌న్సాలీ నుంచి మ‌రో క‌ళాత్మ‌క చిత్రం కూడా ఉంది. ఇక హిస్టారిక‌ల్ కాక‌పోయినా ఫిక్ష‌న‌ల్ జోన‌ర్ లో వ‌స్తున్న క‌ర‌ణ్ జోహార్ బ్ర‌హ్మాస్త్ర పాన్ ఇండియా కేట‌గిరీలోనే రిలీజ్ కి రానుంది. ఇటు సౌత్ లోనూ మ‌ల‌యాళంలో ప్రియ‌ద‌ర్శ‌న్ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టించిన మ‌మాంగం త్వ‌ర‌లో రిలీజ్ కి వ‌స్తోంది. పాన్ ఇండియా కేట‌గిరీలో ఇవ‌న్నీ రిలీజ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వ‌స్తున్న పానిప‌ట్- తానాజీ చిత్రాల‌పై సర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.