Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ఏజ్ లెస్ బ్యూటీస్ ఫ‌రెవ‌ర్

By:  Tupaki Desk   |   18 Feb 2020 10:30 PM GMT
టాప్ స్టోరి: ఏజ్ లెస్ బ్యూటీస్ ఫ‌రెవ‌ర్
X
శ్రీయ‌..త్రిష‌..న‌య‌న‌తార దాదాపు రెండు ద‌శాబ్ధాల నుంచి సౌత్ లో నాయిక‌లుగా కొన‌సాగుతున్నారు. కెరీర్ విష‌యంలో త్రిష‌.. న‌య‌న‌తార కంటే శ్రీయ రెండు ఆకులు ఎక్కువే తింది. వాళ్లిద్ద‌రికి ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌క్కలా క‌నిపిస్తోంది. గ్లామ‌ర్ .. స్లిమ్‌ ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయ‌డంలో మాత్రం ఆ ఇద్ద‌రి కంటే అడ్వాన్స్ డ్ గా ఉంటోంది. అవ‌కాశాల ప‌రంగా వాళ్లిద్ద‌రంత బిజీగా లేక‌ పోయినా అడ‌పా ద‌డ‌పా తెర‌పై క‌నిపిస్తూనే ఉంది. ఇక త్రిష‌..న‌య‌న‌తార గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోలీవుడ్ లో ఇప్ప‌టికీ టాప్ హీరోయిన్లుగా కొన‌సాగుతున్నారు.

స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే యువ హీరోల‌తోనూ ఛాన్సులు అందుకుంటున్నారు. టాలీవుడ్ విష‌యంలో సెల‌క్టివ్ గా వెళ్తున్నారు. స్టార్ హీరోతో అవ‌కాశం .. పైగా మంచి స్క్రిప్ట్ అయితేనే ఒకే చేస్తున్నారు. వ‌య‌సులో ముగ్గురు 35 ప్ల‌స్ లోనే ఉన్నారు. త్రిష 35 అధిగ‌మించింది... న‌య‌న తార 36..శ్రియ వ‌య‌సు ఆ ఇద్ద‌రి కంటే ఎక్కువే. త‌న ఏజ్ 37. ఆస‌క్తిక‌ర విష‌యం ఏమంటే.. ఈ ముగ్గురు భామ‌ల‌ స్కిన్ టోన్ మాత్రం ఇప్ప‌టికీ ఎక్క‌డా చెక్కు చెద‌ర‌లేదు. అదే అందం..అభిన‌యం తో మంచి రూప లావాణ్యాన్ని కలిగి ఉన్నారు. దాదాపు ఆ ముగ్గురి ఎంట్రీ కూడా ఒకేసారి జ‌రిగింది. అదే స‌మ‌యంలో వీళ్ల‌తో పాటు చాలా మంది భామ‌లు ఎంట్రీ ఇచ్చినా కానీ ఈ ముగ్గురిలా నిల‌దొక్కుకున్న‌ది లేదు.

ఎవో కొన్ని సినిమాలు చేసి ప‌రిశ్ర‌మ నుంచి వెళ్లి పెళ్లితో సెటిలైపోయారు. ఇటీవ‌లే శ్రియ దాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టింది. అయినా సినిమాల‌పై ఫ్యాష‌న్ మాత్రం కొన‌సాగిస్తోంది. ఛాన్సులు రావాలే గానీ..నేను రెడీ అంటూ దూసుకొస్తుంది. ఇక న‌య‌న్..త్రిష‌లు నేటి త‌రం నాయిక‌ల‌తో పోటీ ప‌డుతూ అవ‌కాశాలు అందుకుంటున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్...స‌మంత‌...అనుష్క లు ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ హీరోయిన్ల‌లో నిల‌దొక్కుకున్న వారి జాబితా లో ఉన్నారు.