Begin typing your search above and press return to search.

ఆ పురాత‌న దేవాల‌యంలో `ఆచార్య‌` టాప్ సీక్రెట్స్

By:  Tupaki Desk   |   29 Sept 2020 10:00 AM IST
ఆ పురాత‌న దేవాల‌యంలో `ఆచార్య‌` టాప్ సీక్రెట్స్
X
గ‌త కొంత‌కాలంగా `ఆచార్య` చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ మెగాభిమానుల్ని యంగేజ్ చేస్తున్నా.. షూటింగ్ సాగ‌క‌పోవ‌డంతో ఆ విష‌యంలో అంతా అసంతృప్తిగానే ఉన్నారు. మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు షూటింగులు బంద్ అవ్వ‌డం నిరాశ‌ప‌రిచింది. ఇది `ఆచార్య` లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టుకు ఊహించ‌ని అవాంత‌రంగానే మారింది. కొర‌టాల నేడో రేపో అన్నంత క‌సిగా ఉన్నా ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌డం లేదు.

ఎట్ట‌కేల‌కు మెగాస్టార్ చిరంజీవి అనుమ‌తితో షూటింగ్ కి సిద్ధ‌మ‌వుతోంది ఆచార్య బృందం. ఇప్ప‌టికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ ని నిర్మించారు. అయితే ఆరంభం చిరంజీవి షూటింగులో పాల్గొనర‌ని తెలుస్తోంది. ఇత‌రుల‌పైనే చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌నున్నారు. ఇక సెట్స్ లో మ‌హ‌మ్మారీ సోక‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నారు.

ఆచార్య క‌థాంశంపైనా మెగాభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇది దేవాదాయ శాఖ అవ‌క‌త‌వ‌క‌లు మ‌తాచారాల మాటున దాగి ఉన్న అరాచకాల‌పైనా థ్రిల్ల‌ర్ త‌ర‌హా చిత్రం అన్న ప్ర‌చారం సాగుతోంది. సోషియో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ యాంగిల్ .. న‌క్స‌లిజం నేప‌థ్యం వ‌గైరా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఇందులో చిరు దేవాదాయ శాఖ అధికారిగా న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్ న‌క్స‌లైట్ గా ఎమోష‌న‌ల్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. కాజ‌ల్ ఈ చిత్రంలో ఒక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. రెజీన ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించ‌నుంది. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.