Begin typing your search above and press return to search.
బాబు గారే భయపడితే ఇండస్ట్రీ ఏమైపోవాలి?
By: Tupaki Desk | 29 Jun 2021 8:00 AM ISTసినీపరిశ్రమ క్రైసిస్ నుంచి బయటపడాలంటే థియేటర్లు తెరవాలి. వరుసగా సినిమాలు రిలీజై బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాలి. అలా జరగాలంటే క్రేజు ఉన్న సినిమాల్ని రిలీజ్ చేస్తేనే ఇప్పుడున్న పరిస్థితిలో విజయం సాధ్యం.
అయితే అలాంటి క్రేజు ఉన్న ఓ మూడు సినిమాల్ని ప్రముఖ నిర్మాత కం ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు ఓటీటీలకు అమ్మేశారంటూ ప్రచారం సాగుతోంది. ఎగ్జిబిటర్లను ఉలిక్కి పాటుకు గురి చేసే నిర్ణయమిదని ఇండస్ట్రీలో గుసగుసలు వైరల్ అవుతున్నాయి. అసలు ఉలుకు పలుకు అన్నదే లేకుండా నారప్ప-విరాఠఫర్వం-దృశ్యం 2 లాంటి క్రేజు ఉన్న చిత్రాల్ని ఓటీటీలకు అమ్మేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంత పెద్ద బాబు గారే ఇలా క్రైసిస్ కి భయపడి ఓటీటీలకు అమ్ముకుంటే తమ పరిస్థితి ఇంకేం కావాలి? అంటూ ఇతరులు భయపడే పరిస్థితి కనిపిస్తోందిట. అంతేకాదు.. ఇలాంటి మంచి సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేయకపోతే ఎగ్జిబిషన్ రంగం మనుగడ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం అన్న మాట వినిపిస్తోంది. ఏవో కొన్ని థియేటర్లు మూత వేసినంత మాత్రాన సురేష్ బాబు అంతటి నిర్ణయం తీసేసుకుంటారా? ఇలా అయితే ఎగ్జిబిషన్ రంగం ఏమైపోవాలి? అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఆయన ఇంకా సినిమాల్ని అమ్మకాలు సాగించారా లేదా? అన్నదానికి సరైన ఆధారాలేవీ లేవు. అధికారికంగా ఎలాంటి సమాచారం అగ్ర నిర్మాత వెల్లడించనేలేదు.
ఇన్నాళ్లు పలువురు నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీలకు అమ్మకుండా నష్టమొచ్చినా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లంతా ఓటీటీలకు బేరం పెడతారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇది ఎగ్జిబిషన్ రంగానికి శరాఘాతం అవుతుందన్న భయాందోళన నెలకొంది. ఇకపోతే వెయిట్ చేసి రిలీజ్ చేసిన వారికి ఉప్పెన- జాతి రత్నాలు రేంజు ఫలితాలు దక్కితే అప్పుడు సురేష్ బాబు తన నిర్ణయం తప్పు అని అంగీకరిస్తారేమో!!