Begin typing your search above and press return to search.
అగ్ర హీరోలు ఇక ఆ రికార్డులు కొట్టడం కష్టమే!
By: Tupaki Desk | 28 Dec 2020 7:04 PM ISTతెలుగు రాష్ట్రాల్లో అగ్ర హీరోల సినిమాలు విడుదల అయితే ఆ కలే వేరు. థియేటర్ లన్నీ సందడిగా మారి ఓ పండగలా ఉంటుంది. అగ్ర హీరోల ఓపెనింగ్స్ రికార్డుల గురించి అభిమానులు లెక్కలు వేస్తూ మా హీరో గొప్పంటే ..మా హీరో గొప్ప అని ఊదరగొడుతుంటారు. అయితే ఆ రికార్డులు కొట్టడం ఇక అగ్ర హీరోలకు కొద్ది రోజులు కష్టమే అనిపిస్తోంది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాలు విడుదల అయితే మొదటి రోజు టాక్ ఎలా ఉంది. ఎంత వసూలు చేసింది..అనే లెక్కలు వినిపిస్తుంటాయి. అగ్ర హీరోల సినిమాలకు మొదటి రోజు ఎంతో కీలకం. ఎక్స్ ట్రా ఆటలు కూడా వేసి సాధ్యమైనంతవరకు మొదటి రోజే కలెక్షన్లు భారీగా రాబట్టేందుకు నిర్మాతలు స్కెచ్ లు వేస్తుంటారు. అగ్ర హీరో సినిమా విడుదల అయితే చాలు మొదటి రోజు రికార్డ్ బద్దలు కొట్టే విధంగా ప్లాన్లు వేస్తుంటారు.
అభిమానులు కూడా మా హీరో సినిమా మొదటి రోజు ఇంత వసూలు చేసిందంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ కరోనా కాలంలో ఆ లెక్కలిక కుదరవు. ప్రస్తుతం 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్షీ తో మాత్రమే సినిమా టికెట్లు ఇస్తున్నారు. అంటే సినిమా ఎంత బాగున్నా నిండేది సగం హాలే. దీంతో కలెక్షన్లు కూడా మునుపటితో పోలిస్తే సగమే వస్తాయి. పోనీ టికెట్ రేట్లు భారీగా పెట్టినా ఈ కరోనా కాలంలో అంత పెట్టి సినిమా చూసేందుకు జనం కూడా అంత సిద్ధంగా లేరు.
కరోనా కాలం అంతరించే దాకా మొదటి రోజు రికార్డ్ లు, ఇండస్ట్రీ హిట్లు ఆశించడం అత్యాశే అవుతుందేమో. ఈ సంక్రాంతికి క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ , అరణ్య వంటి భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి. మార్చిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదల అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలు ఎంత మేరకు కలెక్షన్లు సాధిస్తాయో చూడాల్సి ఉంది. ఈ శుక్రవారం తెరమీదకొచ్చిన సాయి తేజ్ సోలోబ్రతుకే సో బెటరు ఆశాజనకంగా వసూళ్ళు సాధించడం కాస్త ఊరట నిచ్చే విషయం.