Begin typing your search above and press return to search.

ఒకవైపు వస్తోంది మరోవైపు పోతోంది!

By:  Tupaki Desk   |   13 Jan 2019 11:00 PM IST
ఒకవైపు వస్తోంది మరోవైపు పోతోంది!
X
ఒకప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ పద్దతే వేరుగా ఉండేది. నిర్మాత షూటింగ్ ప్రారంభించడానికి ముందే కొందరు పంపిణిదారులను పిలిపించి కథను వినిపించి యాక్టర్స్ లిస్టు డిస్కస్ చేసి వాళ్ళు వర్క్ అవుట్ అవుతుంది అని చెబితేనే ముందుకు వెళ్ళేవాడు. ఫస్ట్ కాపీ వచ్చాక వాళ్ళు చూసాకే బేరసారాలు సాగేవి. కాని ఇప్పుడంతా రివర్స్. కాంబినేషన్ అనౌన్స్ చేయడం ఆలస్యం ముందు వెనుకా చూడకుండా ఫైనాన్షియర్లు డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సుల పేరుతో కోట్లు కుమ్మరిస్తున్నారు. విడుదల తేది ప్రకటించడం ఆలస్యం పోటీదారులు ఎగరేసుకుపోతారేమో అన్న భయంతో ఎంత రిస్క్ అయినా వెనుకాడటం లేదు.

అదే ఇప్పుడు కొంత వరంగా అంతకంటే ఎక్కువ శాపంగా మారుతోంది. అల్లు అరవింద్-సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలు చాలా కాలం నుంచే స్పీడ్ తగ్గించి తెలివిగా లిమిటెడ్ బడ్జెట్ లతో హిట్లు కొడుతూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కాని దిల్ రాజు-ఏషియన్ సునీల్-యువి లాంటి వాళ్ళు మాత్రం మహా దూకుడుగా వ్యవహరిస్తూ కోట్ల పందెం ఆడుతుండటం ఇప్పుడు రిస్క్ లో పడేస్తోంది. దిల్ రాజు నిర్మాతగా ఒక పక్క డిస్ట్రిబ్యూటర్ గా మరోపక్క రెండు రకాల రిస్క్ లలో ఎదురీదుతున్నారు. గత ఏడాది నిర్మాతగా ఏకంగా మూడు పరాజయాలు దెబ్బ తీసాయి. మరొవైపు కనివిని ఎరుగని రీతిలో 2.0 హక్కులను ఎన్వి ప్రసాద్-సునీల్ లతో కలిసి 72 కోట్లకు కొంటె ఫైనల్ గా చెరో 5 కోట్లకు పైగా నష్టం తప్పలేదు. మరోవైపు యువి సంస్థ తన స్థాయికి మించి సాహో కోసం పెట్టుబడుల వరద పారించింది. దాని కోసమే విధేయ విధేయ రామ తెలుగు హక్కులను 72 కోట్లకు కొంటె ఆ మొత్తం రావడమే అనుమానంగా ఉంది.

ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ దెబ్బలు మాత్రం తప్పడం లేదు. దిల్ రాజుని తాజాగా ఎఫ్2 సేఫ్ చేసే అవకాశాలు కనిపిస్తుండగా నైజాంకు కొన్న వినయ విధేయ రామ వాటిని పోగొట్టే ప్రమాదం కంటి ముందే కనిపిస్తోంది. సో ఇలా డ్యూయల్ సిం ఫోన్ల తరహాలో నిర్మాణం డిస్ట్రిబ్యూషన్లు చేపడుతున్న వీళ్ళంతా డేంజర్ గేమ్ ఆడుతున్నట్టే. ఇవి చాలదు అన్నట్టు ఏషియన్ సునీల్ కున్న మల్టీ ప్లెక్స్ చెయిన్ల నిర్వహణ మరో సవాల్ గా మారింది. దిల్ రాజు సురేష్ అరవింద్ లకు సైతం థియేటర్లు ఉన్నప్పటికీ సునీల్ దే వీటిలో పైచేయి. సో ఇకనైనా అలెర్ట్ గా ఉండి ఏవైనా దిద్దుబాటు చర్యలు మొదలుపెడతారో లేక క్రేజీ కాంబోల పేరిట ఇలాగే పెట్టుబడుల వరద పారిస్తారో చూడాలి