Begin typing your search above and press return to search.

మ‌హేష్ క్యూలో టాప్ డైరెక్ట‌ర్స్

By:  Tupaki Desk   |   30 Jan 2020 4:12 AM GMT
మ‌హేష్ క్యూలో టాప్ డైరెక్ట‌ర్స్
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ రెండు ద‌శాబ్ధాల‌ కెరీర్ లో 26 చిత్రాల్లో న‌టించారు. గ‌డిచిన నాలుగైదేళ్ల‌లో శ్రీ‌మంతుడు- భ‌ర‌త్ అనే నేను- మ‌హ‌ర్షి- స‌రిలేరు నీకెవ్వ‌రు .. ఇవ‌న్నీ చ‌క్క‌ని విజ‌యాల్ని న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌మంతుడు - భ‌ర‌త్ అనే నేను బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిల‌వ‌గా.. మ‌హ‌ర్షి .. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాన్ని అందించాయి.

ఆ క్ర‌మంలోనే రెట్టించిన ఉత్సాహంలో ఉన్న మ‌హేష్ త‌దుప‌రి త‌న కెరీర్ 27వ చిత్రంలో న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. అమెరికాలో కాలి గాయానికి శ‌స్త్ర చికిత్స అనంత‌రం వంశీ పైడిప‌ల్లితో క‌లిసి ఎంబీ 27 ప్రారంభిస్తాడు. గ్యాంగ్ స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ క‌థాంశంతో పాన్ ఇండియా కేట‌గిరీ లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా త‌ర్వాతా మ‌హేష్ లైన‌ప్ ఓ రేంజులో ఉంది.

ఇప్ప‌టికిప్పుడు మ‌హేష్ క్యూలో ఎంత‌మంది స్టార్‌ డైరెక్ట‌ర్లు ఉన్నారు? అన్న‌ది చూస్తే .. MB27 వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఇప్ప‌టికే స్క్రిప్టు రెడీ అయ్యింది. మ‌హేష్ ఫైన‌ల్ చేయ‌గానే సెట్స్ కెళ్ల‌డ‌మే త‌రువాయి. దీనికి మ‌రో ఐదు నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ఆ త‌ర్వాత MB28 కి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. మాట‌ల మాంత్రికుడు ఇప్ప‌టికే మ‌హేష్ కోసం స్క్రిప్టును రెడీ చేసే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది. ఫైన‌ల్ డ్రాఫ్ట్ ని మ‌హేష్ ఓకే చేస్తే పైడిప‌ల్లి సినిమా త‌ర్వాత సెట్స్ కెళతారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ స‌రిలేరు నీకెవ్వ‌రు ఫేం అనీల్ రావిపూడి తో మ‌రో సినిమా (MB29) చేయ‌నున్నాడు. అయితే MB28 .. MB29 స్థానంలో మ‌ధ్య‌లో క‌న్న‌డ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ప్ర‌వేశించినా ఆశ్చ‌ర్య‌ పోన‌క్క‌ర్లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే కేజీఎఫ్ చిత్రంతో సంచ‌ల‌నాలు సృష్టించి కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 తెర‌కెక్కిస్తున్న ప్ర‌శాంత్ నీల్ కి మ‌న స్టార్ హీరోల్లో అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉంది. అందుకే అత‌డిని మ‌హేష్ లైన్ లోకి తెచ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక సుకుమార్ తో ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేదు. అయినా సుక్కూ మ‌హేష్ తో సినిమా చేసేందుకు ఆస్కారం లేక‌పోలేదు.